iDreamPost
android-app
ios-app

ప్రభాస్ సినిమాల వరస మారుతోంది

ప్రభాస్ సినిమాల వరస మారుతోంది

సాహో, రాధే శ్యామ్ లు వరసగా నిరాశ పరిచినప్పటికీ క్రేజ్ విషయంలో ఏ మాత్రం తగ్గదేలే అంటూ దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం నాన్ స్టాప్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో చూస్తున్నాం. సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె వివిధ దశల్లో ఉండగా స్పిరిట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇక మారుతీకి కమిటైన రాజా డీలక్స్ (ప్రచారంలో ఉన్న టైటిల్) తాలూకు స్క్రిప్ట్ పనులు ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను సెప్టెంబర్ నుంచే మొదలుపెట్టే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. ఆ నెలలో ప్రభాస్ కాల్ షీట్స్ ఎక్కువ అందుబాటులో ఉండటంతో నిర్మాత దానయ్యకు చెప్పి దానికి తగట్టు ఏర్పాట్లు చేసుకునేలా ఆల్రెడీ చెప్పేశారట

నిజానికి పక్కా కమర్షియల్ ఫ్లాప్ కాగానే మారుతీతో డార్లింగ్ చేస్తాడా లేదా నే అనుమానాలు తలెత్తాయి. కానీ ప్రభాస్ అదేమీ పట్టించుకోలేదు. రాజా డీలక్స్ తో ప్రొసీడ్ అవ్వడానికే నిర్ణయించుకున్నాడు. ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ జానర్ లో ఇది సాగుతుందని యూనిట్ నుంచి లీకవుతున్న అప్డేట్. సో ప్రభాస్ ని మొదటిసారి డిఫరెంట్ సెటప్ లో చూడబోతున్నాం. ఇందులో హీరోయిన్లుగా అనుష్క, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా లాక్ అయ్యారని తెలిసింది. అఫీషియల్ గా చెప్పలేదు అంతే. ఇలాంటివి స్టార్ హీరోలు చేయడం అరుదు. అందులోనూ పెద్ద స్థాయి బడ్జెట్ తో ఈ మధ్య రూపొందలేదు. అందుకే ఇది స్పెషలవుతుంది

ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సినిమాల్లో వరసలో ఏవి వస్తాయో చెప్పడం కష్టం. అది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా టైం పట్టేలా ఉంది. సలార్ 2023 వేసవికి ముందు కానీ పూర్తయ్యేలా లేదు. ప్రాజెక్ట్ కె 2024 రిలీజ్ కష్టమే. అంతకన్నా ఆలస్యం కావొచ్చు. ఇక స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే చెప్పాలి. సో అన్నింటి కన్నా ఎక్కువ ఫాస్ట్ గా అయ్యేది రాజా డీలక్సే. చిరంజీవితోనే ఆఫర్ కొట్టేసిన మారుతీకి ఇది బ్లాక్ బస్టర్ అయితే ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుంది. సుజిత్, రాధా కృష్ణలు చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుని ప్రభాస్ ని చూపిస్తే కెరీర్ కు తిరుగు ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి