iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరిలో పూజా ఓటు ఎవరికో

  • Published Mar 31, 2020 | 1:40 PM Updated Updated Mar 31, 2020 | 1:40 PM
  • Published Mar 31, 2020 | 1:40 PMUpdated Mar 31, 2020 | 1:40 PM
ఆ ఇద్దరిలో పూజా ఓటు ఎవరికో

ఇప్పుడు టాలీవుడ్ ల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా టాప్ డిమాండ్ లో ఉన్న పూజా హెగ్డే కోసం తమిళ తంబీలు కూడా ఎదురు చూస్తున్నారు. బంగారం విలువ మన దగ్గరున్నప్పుడు కన్నా పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుందన్న తరహాలో కోలీవుడ్ ఇప్పుడు పూజాను చాలా మిస్సవుతోంది. కారణం ఉంది. పూజా హెగ్డే ఇండస్ట్రీ డెబ్యు జరిగింది తమిళ సినిమాతోనే. రంగం ఫేం జీవా హీరోగా రూపొందిన మూగముడితో పరిచయమయ్యింది. మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగులో మాస్క్ పేరుతో డబ్ చేశారు కాని రెండు బాషల్లోనూ ఇది ఫెయిల్ అయ్యింది.

ఆ తర్వాత కొంతకాలానికి పూజా తెలుగు డిజే తో సక్సెస్ అందుకోవడం ఆపై వెనుదిరిగి చూసే అవకాశం రాకపోవడంతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకవైపు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సరసన ఆఫర్లు దక్కించుకుంటున్న పూజా హెగ్డే ఇక్కడ అందరు స్టార్లతోనూ నటించేసింది. తాజాగా తమిళ్ లో ఇద్దరు స్టార్లు తన కోసం పోటీ పడుతున్నారట. ఒకరు విజయ్ కాగా మరొకరు సూర్య. మాస్టర్ తర్వాత విజయ్ ఆకాశం నీ హద్దురా ఫేం సుధా కొంగర దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో విజయ్ కు జోడిగా పూజాని ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయట.

మరోవైపు సూర్య హరి దర్శకత్వంలో చేయబోయే ఆరువా కోసం పూజానే అడుగుతున్నారట. సింగం సిరీస్ తో తనకు గట్టి మాస్ ఇమేజ్ ఇచ్చిన హరి అంటే సూర్యకు చాలా గురి. అందుకే మరోసారి మాస్ ఎంటర్ టైనర్ తనతోనే చేయాలనీ డిసైడ్ అయ్యాడు. కాని పూజా హెగ్డే డేట్స్ అంత ఈజీగా దొరికేలా లేవు. అందులోనూ కరోనా వల్ల షెడ్యూల్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. ప్రభాస్ సినిమా, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లతో పాటు సల్మాన్ ఖాన్ మూవీతో పూజా బిజీగా ఉంది. ఇప్పుడు సూర్య, విజయ్ లలో ఒక్కరికే ఎస్ చెప్పగలదు. సూర్య కాంపౌండ్ తమకే అని కాన్ఫిడెంట్ గా ఉందని చెన్నై టాక్. మరి విజయ్ అంత తేలిగ్గా వదులుతాడా. చూడాలి పూజా ఎవరికి జంట కానుందో.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet