iDreamPost
iDreamPost
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో ఆదిత్య కరికాలన్‌గా చియాన్ విక్రమ్ చెలరేగిపోపోయాడు. ఈ టీజర్ ఒకనాటి చరిత్రను కళ్లముందుగా చాలా గొప్పగా తీసుకొచ్చింది. 55 ఏళ్ల క్రితం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం సినిమా తెరకెక్కుతోంది. వీరుడైన చోళ యువరాజు ఆదిత్య కరికాలన్‌ని ఎవరు చంపారు? ఈ సినిమాలో అదే సస్పెన్స్. అతను సింహాసనానికి వారసుడు. ఇందులో కీలకమైన నందిని పాత్రను ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించింది. ఇదేమీ హీరోయిన్ పాత్రకాదు. అంతఃపురం వ్యూహాలు, కుట్రలు కుతంత్రాలకు ఆమె కారణం.
ఐశ్వర్య రాయ్ బచ్చన్-త్రిష ఎదురెదురుపడటం, విక్రమ్ కోటగోడలను బద్ధలుకొట్టి, వీరోచిత ప్రవేశం పొన్నియన్ సెల్వన్ టీజర్ పై నెటిజన్ల ప్రేమ చూపిస్తున్నారు.
రాజ రాజ చోళన్‌గా జయం రవి నటించాడు. అతను పొన్నియన్ సెల్వన్‌గా, ఆ తర్వాత రాజ రాజ చోళుడిగా కనిపించనున్నాడు. అతను ఆదిత్య కరికాలన్ తమ్ముడు. జయం రవి దీన్ని డ్రీమ్ రోల్ గా చెప్పుకున్నాడు.
ఇక కార్తీని వల్లవరైయన్ వంద్యదేవన్‌గా చూపించనున్నారు మణిరత్నం. అతను వానర్ వంశానికి యోధుడు. ఆయనకు జోడీగా త్రిష నటిస్తోంది.
ఈ సినిమాలో ఎవరూ హీరోలు కాదు. కీలకమైన పాత్రల సమాహారం. మణిరత్నం సినిమాలో చిన్నచిన్న పాత్రలకుకూడా ప్రాధాన్యత ఉంటుంది.
పొన్నియన్ సెల్వన్ లో సుందర చోళగా ప్రకాష్ రాజ్ నటించాడు. అతను సుందర చోళుడు వంశానికి మూలపురుషుడు. అతని కొడుకు ఆదిత్య కరికాలన్ పాత్రను చియాన్ విక్రమ్ పోషించాడు.
ఈ సినిమాలో కథలో చాలా సంక్షిష్టత ఉంటుంది. చాలా పాత్రలు భావోద్వేగాలతో ఒకదానితో మరొకటి ముడిపడిఉంటాయి. అందుకే రెండు పార్టుల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.
చివరగా, నందినా ఐశ్వర్య రాయ్ గ్రేస్ ఫుల్ గా కనిపిస్తోంది. ఆమెకు త్రిషకు మధ్య వ్యూహాల పోరు నడుస్తుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం దాదాపు 18 మంది డిజనర్లు పనిచేశారు.