iDreamPost
android-app
ios-app

Thangalaan Day 2 Collections: తగ్గేదే లే అంటున్న తంగలాన్ కలెక్షన్లు! డే 2 ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • Published Aug 17, 2024 | 9:24 AM Updated Updated Aug 17, 2024 | 9:47 AM

తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన విక్రమ్.. అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించాడు. మరి తంగలాన్ మూవీ సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన విక్రమ్.. అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించాడు. మరి తంగలాన్ మూవీ సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 17, 2024 | 9:24 AMUpdated Aug 17, 2024 | 9:47 AM
Thangalaan Day 2 Collections: తగ్గేదే లే అంటున్న తంగలాన్ కలెక్షన్లు! డే 2 ఎన్ని కోట్లు వచ్చాయంటే?

తంగలాన్.. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రం. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్, పా. రంజిత్  కాంబోలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. విక్రమ్ యాక్టింగ్ కు ఆడియెన్స్ పిచ్చెక్కిపోతున్నారు. దాంతో థియేటర్ల దగ్గర తంగలాన్ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. తొలిరోజే అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టిన విక్రమ్.. అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించాడు. మరి ఇండియాలో, వరల్డ్ వైడ్ గా సెకండ్ డే తంగలాన్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.

చియాన్ విక్రమ్ విలక్షణ పాత్రలో స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మూవీ తంగలాన్. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి తొలిరోజు భారీ వసూళ్లు వచ్చాయి. విక్రమ్ గెటప్, ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే మూవీ ఉండటంతో.. తొలిరోజు ఊహించని కలెక్షన్స్ ను రాబట్టాడు విక్రమ్. తంగలాన్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 20 కోట్ల షేర్, రూ. 26.44 కోట్ల గ్రాస్ వసూళ్లును సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రెండో రోజు కూడా విక్రమ్ తన జోరును చూపించాడు.

తంగలాన్ సెకండ్ డే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సొంత రాష్ట్రమైన తమిళనాడులో భారీ వసూళ్లను సాధిస్తోంది. తమిళ్ లో రూ. 3.5 కోట్లు, తెలుగులో రూ. కోటి, కర్ణాటకలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 2 కోట్లను రాబట్టింది. మెుత్తంగా ఈ చిత్రం సెకండ్ డే వరల్డ్ వైడ్ గా రూ. 7.5 కోట్లను కొల్లగొట్టాడు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 34 కోట్లను సాధించింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 64 కోట్ల మేర షేర్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి విక్రమ్ సెకండ్ డే సాధించిన కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio