iDreamPost
android-app
ios-app

చంద్రబాబు పర్యటనకు బ్రేక్‌

చంద్రబాబు పర్యటనకు బ్రేక్‌

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్‌ పడింది. ఈ రోజు విశాఖ విమానాశ్రయంలో ఆయన దిగగానే ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు మద్ధతు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది.

తన కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై చంద్రబాబు రోడ్డుపై భైఠాయించారు. దాదాపు నాలుగున్నర గంటల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి తిరిగి ఎయిర్‌పోర్టు లాంజ్‌లోకి వెళ్లారు. పర్యటనకు అనుమతి తీసుకున్నా.. ఎందుకు పోనివ్వడంలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తనను అరెస్ట్‌ చేస్తే ఎందుకు చేస్తున్నారో కాగితంపై రాసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతాకారణాల దృష్ట్యా సెక్షన్‌ 151 ప్రకారం ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నామని చంద్రబాబుకు నోటీసులిచ్చారు. దీంతో ఈ రోజు, రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు చేయాలనుకున్న ప్రజా చైతన్య యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లైంది.

Read Also : టిడిపి ప్రజా బ్యాలెట్‌ … రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారా..?