iDreamPost
android-app
ios-app

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. వైరల్ గా మారిన వీడియో!

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. వైరల్ గా మారిన వీడియో!

ఆకాశంలో ఉన్న విమానంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వినటానికి భయంగా ఉన్న ఇది నిజం. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ సమయంలో ఫైలెట్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంతకు ఆ విమానం ఎక్కడ ల్యాండ్ అయిందా? ఈ ప్రమాదంలో అసలు కారణం ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.

మీడియా కథనం ప్రకారం.. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ లోని విలియం హబీ విమానాశ్రయం నుంచి మెక్సికో బయలు దేరింది. ఇక విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల్లో వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ విమానం ఇంజన్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ మంటలను చూసి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంతకింతకు ఆ మంటలు మరింత ఎక్కువయ్యాయి.

సమస్యను గుర్తించి అప్రమత్తమై ఫైలెట్ టేకాఫ్ అయిన ఎయిర్ పోర్టులోనే ఆ విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. ఇక వెంటనే సౌత్ వెస్ట్ ఎయిర్ లెన్స్ మరో విమానంలో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. అయితే యాంత్రిక లోపం కారణంగానే ఈ విమానంలో ఇలా మంటలు వచ్చాయని సౌత్ వెస్ట్ ఎయిర్ లెన్స్ తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లుగా కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నిమిదిన్నర ఏళ్ల బాలుడు! అసలు స్టోరీ ఏంటంటే?