మీ నాయన్నే చూసినట్లుందయ … జగన్

వైఎస్‌ రాజశేఖరరెడ్డి… ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో.. తెలుగు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోయే పేరు. పేద, మధ్యతరగత ప్రజల జీవితాలను మార్చాలని తప్పనపడిన ఏకైక నాయకుడు. తపన పడడమేకాదు.. అందు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కూడా. స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తున్న నేటికీ పేదరికంలో మగ్గుతూ… విద్యకు, వైద్యానికి దూరమైన కుటుంబాలకు వాటిని దగ్గర చేసి పేదరికాన్ని ప్రాలదొలేందుకు నడుంబిగించిన మహనీయుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు ఇప్పటికీ చెబుతుంటారు.

ఆ ప్రజా నాయకుడుని నేడు మళ్లీ చూసినట్లుగా ఉందని వారంటున్నారు. ఈ రోజు విజయనగరంలో జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుంటే.. జగన్‌ స్థానంలో వైఎస్‌ను చూశామని ఫీజురియంబర్స్‌మెంట్‌ లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం భారత చరిత్రలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పరిశీలకులు చెబుతుంటారు. పెద్ద కొడుకుగా వైద్యం చేయించేందుకు ఆరోగ్యశ్రీ, తండ్రి బాధ్యతలు తాను మోసేలా.. పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం.. ఈ రెండు పథకాలు వైఎస్‌ ను ప్రజల్లో దేవుడిని చేశాయని పరిశీలకులు చెబుతున్న మాట.

పేదరికం పోవాలంటే.. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు చదవాలి. పెద్ద జీతం వచ్చే ఉద్యోగాలు చేయాలి. వచ్చే జీతంలో కొంత కుటుంబానికి పంపాలి. అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. ఆ తరం పేదరికం నుంచి బయటకు వస్తే.. ఆ తర్వాత తరాల భవిష్యత్‌ చక్కగా ఉంటుంది. చదవుకు మించిన ఆస్తి ఇంకేముంది. మేము ఇవ్వగలిగిందదే.. అంటూ సీఎం జగన్‌ ఈ రోజు విజయనగరంలో మాట్లాడుతుంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డే కళ్ల ముందు మెదిలారు. అచ్చు వైఎస్‌ రాజశేఖరరెడ్డి లాగే.. పేదల పట్ల, వారి విద్య,వైద్యం పట్ల జగన్‌ కూడా మాట్లాడి తన తండ్రిని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు చెప్పినట్లు తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు తాను వచ్చానన్న జగన్‌ మాటలు.. ఈ విషయంలో మాత్రం నిజమయ్యాయి. ఉన్నత విద్య కోసం వైఎస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెడితే.. జగన్‌ తాను చెప్పినట్లు పేద వారి కోసం ఒక అడుగు వేస్తే.. తాను మూడడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మేరకు.. వేశారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ అందుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 20 వేలు వసతి, భోజనం కోసం ఇచ్చేందుకు వసతి దీవెన పథకం ప్రవేశపెట్టారు. అంతకు ముందు.. గత నెల 9వ తేదీన ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లలను ఉద్దేశించి అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇచ్చారు.

Show comments