iDreamPost
iDreamPost
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. నిర్మాత ఏఎం రత్నం కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టి పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ దీనికి మాత్రం అలా చేయలేకపోయారని ఇన్ సైడ్ టాక్. దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది కరోనా లాక్ డౌన్స్. చాలాసార్లు వాయిదా పడటం వల్ల సెట్స్ డ్యామేజ్ కావడం, వాటిని మళ్ళీ వేయాల్సి రావడం లాంటి పరిణామాలు యూనిట్ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. దానికి తోడు పవన్ జనసేన వ్యవహారాలు మరో ఎత్తు.
ఇదంతా చాలదన్నట్టు ఇప్పటిదాకా షూట్ చేసిన భాగం పవన్ కు అంత సంతృప్తినివ్వలేదట. ఇలాగే కొనసాగిస్తే ఇది ఆడదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వినికిడి. అయితే దర్శకుడు క్రిష్ మార్పులకు ఇష్టపడకపోవడంతో ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి ఆపేశారని తెలిసింది. హీరోయిన్ నిధి అగర్వాల్ అడపాదడపా మీడియాకు కనిపిస్తున్నా ఈ సినిమా ప్రస్తావన పెద్దగా తేవడం లేదు. మరో ప్రత్యేక పాత్రలో జాక్వలిన్ ఫెర్నాండేజ్, వివేక్ ఒబెరాయ్ లాంటి వాళ్ళను తీసుకున్నారని చెప్పారు కానీ వాటి గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. మణికర్ణిక టైంలో కంగనా రౌనత్ తో వచ్చిన ఇష్యూసే ఇప్పుడు వీరమల్లుకు కూడా క్రిష్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది
అసలే ఈ ఫస్ట్ పవర్ స్టార్ ప్యాన్ ఇండియా మూవీ మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్, చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివాళ్లు ఆల్రెడీ జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న నేపథ్యంలో ఈ వీరమల్లే పవన్ కు అది సాధించి పెడుతుందనే నమ్మకంలో ఉన్నారు. తీరా చూస్తే షూటింగ్ ఏమో ఆగుతూ సాగుతూ నిలబడిపోతోంది. మొత్తానికి ఆపేసే ప్రమాదం ఉందంటున్న వారు లేకపోలేదు. అసలు ఇలాంటి గ్రాండియర్ల జోలికి వెళ్లకుండా పవన్ కమర్షియల్ వాటికే కట్టుబడి ఉంటె బాగుండేది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాగా రిస్క్ లేకుండా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. చూద్దాం