iDreamPost
iDreamPost
గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. మూడు నెలల క్రితం ఓటిటిలో రిలీజైన వినోదయ సితంను తెలుగులో చేసేందుకు ఆసక్తి చూపించినట్టుగా అందులో పేర్కొన్నారు. ఒరిజినల్ వెర్షన్ లో సముతిరఖని పోషించిన పాత్రను పవన్ తో చేయించొచ్చనే టాక్ వచ్చింది. మరో కీలకమైన క్యారెక్టర్ కు మోహన్ లాల్ తో మాట్లాడతారని అందులో పేర్కొన్నారు. కాంబినేషన్ అయితే వినగానే అదిరిపోయేలా అనిపిస్తుంది. జనతా గ్యారేజ్, మనమంతా తర్వాత కంప్లీట్ యాక్టర్ మళ్ళీ టాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. మళ్ళీ రావడమంటే మంచి విషయమే.
వినోదయ సితంకు ఎంత మంచి పేరు వచ్చినా అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటుంది. టైం మనిషి రూపంలో వచ్చి ఓ సగటు వ్యక్తితో పాటు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో రూపొందింది. లైన్ ఇలా ఉన్నా ట్రీట్మెంట్ కొంచెం గోపాల గోపాలకు దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ దీన్ని చేస్తే రిపిటీషన్ అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. దీనికి బదులు పవన్ మోహన్ లాల్ కాంబోలో ఏదైనా యాక్షన్ ఎంటర్ టైనర్ లాంటిది డిజైన్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఇదంతా ఎంతవరకు వాస్తవమో అధికారికంగా ప్రకటన వచ్చేదాకా చెప్పలేం కాబట్టి వేచి చూడాలి
పవన్ ప్రస్తుతం భీమ్లా నాయ చివరి షెడ్యూల్ లో ఉన్నారు. రానాతో పాటు ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్లు తీస్తున్నారు. జనవరి 12 విడుదల తేదీలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు కానీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం పోస్ట్ పోన్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. క్రిస్మస్ సెలవులకు ఫ్యామిలీతో గడిపేందుకు రష్యా వెళ్తున్నారు పవన్. మళ్ళీ రెండు వారాల తర్వాత రిటర్న్ అవుతారు. భీమ్లా నాయక్ ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుని హరిహర వీరమల్లుని కంటిన్యూ చేస్తారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎప్పటి నుంచి ఉంటుందనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. నెక్స్ట్ సురేందర్ రెడ్డిది ఉంటుంది
Also Read : Pushpa First Day Collections : భారీ ఓపెనింగ్స్ సాధించిన ఐకాన్ స్టార్