iDreamPost
android-app
ios-app

ఫస్ట్ టైం దొంగగా రాబోతున్న పవన్

  • Published Apr 17, 2020 | 5:59 AM Updated Updated Apr 17, 2020 | 5:59 AM
  • Published Apr 17, 2020 | 5:59 AMUpdated Apr 17, 2020 | 5:59 AM
ఫస్ట్ టైం దొంగగా రాబోతున్న పవన్

ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ దాంతో పాటు క్రిష్ ప్రాజెక్ట్ లోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఖుషి-బంగారం చిత్రాల నిర్మాత ఎఎం రత్నం దీన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ కెరీర్ లో మొట్టమొదటిసారి దొంగగా కనిపించబోతున్నాడు. అది కూడా ఔరంగజేబ్ కాలం నాటి చోరుడిగా చాలా కొత్తగా క్రిష్ దీన్ని రూపొందిస్తున్నాడని అర్థమైపోతోంది. పీరియాడిక్ డ్రామా అనే లీక్ ముందు నుంచే ఉంది కాని పవన్ పాత్ర తాలుకు సమాచారం మాత్రం బయటికి రాకుండా యూనిట్ జాగ్రత్త పడింది.

ఇక ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే దీనికి విరుపాక్ష అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇదంతా అన్నయ్య నాగబాబు స్వయంగా లీక్ చేయడం విశేషం. ముందే అనుకుని చెప్పారో లేక చిరంజీవి ఆచార్య పేరుని త్వరపడి చెప్పినట్టుగా నోరు జారారో తెలియదు కాని ఓ ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సో పవన్ ని ఇంతకుముందు ఎన్నడూ చూడని వేషంలో చూడటం కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ నుంచి అర్జున్ రాంపాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్టుగా ఇంతకు ముందే వార్త వచ్చింది.

కాని యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలెదూ. వకీల్ సాబ్ రిలీజయ్యే దాకా క్రిష్ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ రాకూడదని ముందే నిర్ణయించుకోవడం వల్ల ఆ టీం సైలెంట్ గా ఉన్నట్టు వినికిడి. అయినా ఏదో ఒక రూపంలో లీకులు బయటికి వస్తూనే ఉన్నాయి. క్రిష్ మూవీలో మెయిన్ హీరొయిన్ ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరొయిన్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలియానా పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. రెండు నెలల భారీ గ్యాప్ ని పవన్ పూర్తిగా విశ్రాంతికే కేటాయించబోతున్నాడు. ఈలోగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయట.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom