సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అన్ని వ్యాపారాలున్నాయా..? బాంబు పేల్చిన పవన్‌ కళ్యాణ్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్ మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. ఇకపై తన జీవితం ప్రజా సేవకే అంకితమని పలు సందర్భాల్లో ప్రకటించిన పవన్‌ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ సినీమాల్లో నటిస్తుండడంతో జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. పవన్‌ కళ్యాణ్ నిలకడలేని విధానాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

లక్ష్మీ నారాయణ రాజీనామా లేఖ అందిన వెంటనే పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ లేఖ విడుదల చేశారు. ‘‘నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు లేవు, పవర్‌ ప్రాజెక్టులు లేవు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కాను. నా మీద అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మినారాయణ గారు తెలుసుకుని తన రాజీనామా లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేది’’ అంటూ పవన్‌ లేఖ విడుదల చేశారు.

Read Also: పవన్ కళ్యాణ్ కి మరో షాక్ – జేడీ రాజీనామా

పార్టీకి రాజీనామా చేసినా లక్ష్మీ నారాయణ అంటే తనకు, జనసేన కార్యకర్తలకు ఆయనంటే గౌరవం అంటూ లేఖ చివరలో ముక్తాయించారు. జేడీ లక్ష్మీ నారాయణ రాజీనామా చేసిన దానికంటే.. నిలకడలేని విధానాలంటూ.. తనను విమర్శించడంతో పవన్‌ కల్యాణ్‌కు ఆగ్రహం తెప్పించినట్లుంది. అందుకే పవన్‌ కూడా లక్ష్మీ నారాయణ అంటే గౌరవం అంటూనే ఆయనపై పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేసినట్లు ఆయన లేఖను పరిశీలిస్తే తెలుస్తుంది.

పవన్‌ తన లేఖలో.. ‘‘నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు లేవు, పవర్‌ ప్రాజెక్టులు లేవు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కాను’’ అనే పదాలు ప్రస్తావించారు. అంటే ఇవన్నీ లక్ష్మీ నారాయణకు ఉన్నాయనే అర్థంలో పవన్‌ తన లేఖలో ప్రస్తావించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తనపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించడంతోనే పవన్‌ ఆయన తెరవెనుక వ్యాపారాలను బట్టబయలు చేసినట్లు చెబుతున్నారు.

Read Also: ఎక్కే గడప దిగే గడప , తర్వాత ఎవరో …

ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు చెందిన వి.వి.లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. 2011లో వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్,టీడీపీ నేతలు శంకర్‌రావు, ఎర్రన్నాయడు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు అధికారిగా లక్ష్మీనారాయణను నియమించింది. సీబీఐ జాయిండ్‌ డైరెక్టర్‌ (జేడీ) హోదాలో హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మీ నారాయణ కేసు దర్యాప్తులో ఆయన వ్యవహారశైలితోపాటు దర్యాప్తు వివరాలు కొన్ని మీడియా సంస్థల్లో రావడంతో ఆయన వార్తల్లో నిలిచారు. వి.వి. లక్ష్మీనారాయణ కాస్త జేడీ లక్ష్మీనారాయణగా పేరుగాంచారు.

అయితే సర్వీస్‌ ఇంకా ఉన్నా కూడా లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మ్‌ంట్‌ తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సీబీఐ జేడీగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాల వల్ల తర్వాత కాలంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో రక్షణ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుల సమస్యలు తెలుసుకునేందుకంటూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ పెడతారన్న ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే వ్యూహాత్మకంగా ఆయన జనసేన పార్టీలో చేశారు. జనసేన తరఫున విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.

Read Also: కూలుతున్న జనసేన

ఎన్నికల తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుకే పార్టీ కార్యక్రమాల్లో అతి తక్కువగా పాల్గొన్నారు. పార్టీ నుంచి బయటకొచేందుకు సరైన సమయం కోసం ఎదురుస్తున్న లక్ష్మీ నారాయణకు పవన్‌ మళ్లీ సినిమాల్లో నటిస్తుండడం కలిసి వచ్చింది. ఇదే అదునుగా భావించి పార్టీకి రాజీనామా చేశారు. పనిలో పనిగా పవన్‌ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తిగా అభివర్ణించి బాంబు పేల్చారు. దీని పర్యావసానమే పవన్‌ కళ్యాణ్ .. వ్యాపారల చిట్టాతో కూడిన తాజా స్పందన. ఈ నేపథ్యంలో పవన్‌ తనపై చేసిన ఆరోపణలపై వి.వి. లక్ష్మీ నారాయణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Show comments