iDreamPost
iDreamPost
జేసీ దివాకర్ రెడ్డిని తక్కువ అంచనా వేయకండి : గతంలో పరిటాల రవి .
చంద్రబాబు లోకేష్ లని అరెస్ట్ చేయాలంటే భయం : జేసీ దివాకర్ రెడ్డి .
రాజకీయ పరిజ్ఞానం అంతో ఇంతో ఉన్న వారెవరికైనా పై రెండు స్టేట్మెంట్స్ చూస్తే జేసీ దివాకర్ రెడ్డి అంటే ఏంటో ఒక అవగాహన వస్తుంది . సాధారణ రూపం , సీమ యాస ఉట్టిపడే మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకోగలడు . కట్టి పడేయగలడు . పొగిడిన నోటితోనే బహిరంగంగా తెగడగలడు .
Also Read:అధికారాంతము నందు – ఇందిరా గాంధీకి గెస్ట్ హౌస్ దక్కని అనుభవం
కాంగ్రెస్ ని వీడి తెలుగుదేశంలో జేరిన తర్వాత పలు వేదికల పై బాబుని పొగిడిన జేసి అదే వేదికల పై బాబు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి . ముందరి కాళ్ళకి బంధాలు వేసే మాటలతో పని చేయించుకున్న ఘటనలతో పాటు రాజీనామా చేస్తాను అని బెదిరించిన సందర్భాలు కలదు . 19 ఎన్నికల తర్వాత ఒకానొక సందర్భంలో బహిరంగ వేదిక పై తన ఆక్రోశం వెళ్లగక్కుతూ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కట్టేశావు , మమ్మల్ని సంక నాకించావు అని చంద్రబాబుని మొహాన అనేయడంతో బాబు మొహంలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేనట్టు అయిపోయింది .
19 ఓటమి తర్వాత 2014 లో వైసీపీ లో చేరకుండా టీడీపీని నమ్మి దెబ్బ తిన్నామనే భావనతో ఉన్న జేసీ ఆ బాధని దాచుకునే ప్రయత్నం చేయక పలుసార్లు వ్యక్తం చేయగా , ఇప్పుడు తమ్ముడు జేసీ ప్రభాకర్ కొడుకుతో సహా అరెస్ట్ అయ్యాక ఆ అసహనం మరింత పెరిగినట్లు ఉంది . అంతే కాక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే స్పందించినంత వేగంగా , తీవ్రంగా బాబు , లోకేష్ తన తమ్ముడి అరెస్ట్ పట్ల స్పందించకపోవడంతో జేసికి మరింత ఆగ్రహం కలిగించినట్లు అయ్యింది .
Also Read:జగన్ తో సినీ ప్రముఖుల భేటిపై రాధాకృష్ణకు కడుపుమంట ఎందుకు ?
అందుకే తన తమ్ముడి అరెస్ట్ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారు కానీ చంద్రబాబు , లోకేష్ ని అరెస్ట్ చేయాలంటే భయం అనే వ్యాఖ్యలతో వైసీపీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా బాబు , లోకేష్ మీద ఉన్న కేసులు కూడా త్వరితగతిన విచారించి అరెస్ట్ చేసే విధంగా ప్రేరేపించి బాబు లోకేష్ లని అరెస్ట్ చేస్తే బావుండునని ఆశపడుతున్నాడనుకొంటా . అటు బీజేపీలోకి పోలేక , ఇటు వైసీపీ రానివ్వక , బాబు పట్టించుకోక ఒంటరి అయిన జేసీ బాబు , లోకేష్ లలో ఎవరోకరు అరెస్ట్ అయితే తనకు కాస్త తోడు ఉన్నట్టుంటుంది అని జేసీ ఆలోచన కావొచ్చు .
ఏదేమైనా పరిటాల అన్నట్టు జేసీ తక్కువ వాడేమీ కాదు . .