iDreamPost
iDreamPost
స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖలో తెలుగుదేశం పార్టికి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులైన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చెస్తునట్టు ప్రకటించారు. ఈ సందర్భం గా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా తెలుగుదేశం రాజకీయాలు చెయడంలేదని, కేవలం తమ స్వార్ధం కోసమే పార్టీ పెద్దలు రాజకీయం చెస్తున్నారని, విశాఖను పరిపాలనా రాజధానిగా చెయడం తెలుగుదేశం పెద్దలకు రుచించలేదని, విశాఖకు వ్యతిరేకంగా పొరాడాలని నా పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ సమయంలో రాజకీయంగా పార్టీ ఏది చెబితే అది చేయడమా లేక నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న ఈ ప్రాంతం కోసం నడవాలా అని తర్జన బర్జన పడ్డానని పేర్కొన్నారు. చివరకు ఈ ప్రాంత అభివృద్దే ముఖ్యం అని తన మనసాక్షి ప్రకారం నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన పంచకర్ల రమేష్ బాబు, ఆ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం తరపున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో పంచకర్ల ఒకరు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో పంచకర్ల కూడా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత గంటా, అవంతి లతో కలసి టిడిపి లోకి వెళ్లారు.2014 ఎన్నికల్లో యలమంచలి నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలిచిన పంచకర్ల 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సిపి అభ్యర్ది రమణ మూర్తి రాజు చేతిలో ఒటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న పంచకర్ల సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేసి.. ఆ పార్టీ చేస్తున్న రాజధాని రగడపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.