iDreamPost
iDreamPost
సెకండ్ వేవ్ కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ చేసుకుని మూడో వారంలో అడుగు పెడుతున్న తరుణంలో మెల్లగా కాస్త ఇమేజ్ ఉన్న హీరోలు, పేరున్న ప్రొడక్షన్ హౌసుల సినిమాలు బయటికి వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం ఇచ్చిన కిక్ తో నిర్మాతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం మూడు రోజుల్లో రికవరీ చేసుకోవడంతో మిగిలిన అందరికీ ధైర్యం వచ్చినట్టు అయ్యింది. ఒక్కొక్కరుగా డేట్లు ప్రకటించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ నెల 14న రాబోతున్న పాగల్ మీద యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందాకా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ విశేషాలు చూద్దాం.
ప్రేమ్(విశ్వక్ సేన్)పేరుకి తగ్గట్టే అమ్మాయిలను ప్రేమించడమే పనిగా పెట్టుకుంటాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా 1600 మందిని లవ్ చేసినట్టు గర్వంగా చెప్పుకుంటాడు. వాళ్ళు ఏ కలర్, హైటా కాదా, ఏ జాబు, ఎక్కడి నుంచి వచ్చారు అనేదేమి పట్టించుకోడు. ఆఖరికి కార్పొరేషన్ స్వీపర్ ని కూడా ప్రేమిస్తావా అని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారాని అడిగేంత రేంజ్ లో ఇతగాడి ప్యార్ కహానిలు సాగుతాయి. అప్పుడు వస్తుంది ఇతని జీవితంలో ఓ అమ్మాయి(నివేత పేతురాజ్). మొదట్లో వద్దన్నా తర్వాత ఎస్ చెబుతుంది. ప్రేమ్ ఈమె విషయంలో నిజాయితీగా ఉంటాడు. కానీ అనుకోని సంఘటన జరుగుతుంది. అదేంటో సినిమాలో చూడాలి
ట్రైలర్ కట్ ని ఆసక్తికరంగానే చేశారు. ఓ అమ్మాయిల పిచ్చోడు సిన్సియర్ గా లవ్ చేస్తే ఊహించని విధంగా బ్రేకప్ వస్తే దాన్నెలా తట్టుకుంటాడు అనే పాయింట్ తో రూపొందించిన తీరు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మరీ ఎన్నడూ చూడని విభిన్నమైన పాయింట్ గా అనిపించడం లేదు కానీ అసలు సినిమాలో ఏమైనా ట్విస్టులు ఉన్నాయేమో చూడాలి. మణికందన్ ఛాయాగ్రహణం రిచ్ గా ఉంది. రధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మూడ్ తగట్టు సాగింది. సిమ్రాన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, రంగస్థలం మహేష్, ఇంద్రజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుప్పిలి రచన మరియు దర్శకత్వం వహించారు
Also Read : కండలవీరుడి కోసం గాడ్ ఫాదర్ రిక్వెస్ట్ ?