iDreamPost
android-app
ios-app

ఈ నగరానికి ఏమైంది హీరోయిన్ గుర్తుందా? ఎందుకు కనిపించడంలేదంటే?

  • Published Sep 04, 2024 | 3:49 PM Updated Updated Sep 04, 2024 | 3:49 PM

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రాల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ ఈ నగరానికి ఏమైంది. ఇందులో విశ్వక్, సునీత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను హీరోలుగా నటించారు. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించగా.. సెకండ్ హీరోయిన్ మాత్రం ఒక్కసారిగా తెరమరుగైంది.

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రాల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ ఈ నగరానికి ఏమైంది. ఇందులో విశ్వక్, సునీత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను హీరోలుగా నటించారు. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించగా.. సెకండ్ హీరోయిన్ మాత్రం ఒక్కసారిగా తెరమరుగైంది.

  • Published Sep 04, 2024 | 3:49 PMUpdated Sep 04, 2024 | 3:49 PM
ఈ నగరానికి ఏమైంది హీరోయిన్ గుర్తుందా? ఎందుకు కనిపించడంలేదంటే?

తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం దర్శకుడే కాదు నటుడు కూడా. పెళ్లి చూపులతో జాతీయ అవార్డును కొల్లగొట్టిన ఈ దర్శకుడి నుండి వచ్చిన మరో చిత్రం ఈ నగరానికి ఏమైంది. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా. యూత్‌ను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. కేవలం రూ. 2 కోట్లు పెట్టి తీస్తే.. రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. గత ఏడాది రీ రిలీజ్ చేస్తే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో విశ్వక్ సేన్, సాయి సునీత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను కీ రోల్స్ చేశారు. ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. ఒకరు సిమ్రాన్ చౌదరి, మరొకరు అనితా అంబ్రోస్ నటించింది.

విశ్వక్ సేన్‌ను ఇష్టపడతారు ఈ ఇద్దరు. ఇందులో సిమ్రాన్ చౌదరి ఇప్పటికి సినిమాలు కంటిన్యూ అవుతుంది. కానీ అనితా అంబ్రోస్ కనిపించడం లేదు. ఇంతకు ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎలా ఉందంటే.? అనితా మన తెలుగు అమ్మాయే. ఆమె తల్లిదండ్రులది విశాఖ పట్నం కాగా ఆమె ఒడిశాలో పెరిగింది. విశాఖ, ఒడిశాలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. గీతమ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. మోడల్‌గా మారింది. ఫేస్ బుక్‌లో ఆమె ఫోటోలను చూసిన నిర్మాత నీలిమ ఆమెను చూసి అప్రోచ్ అయ్యారు. అలా టాలీవుడ్‌లోకి కాలు పెట్టింది అనితా. 2013లో వచ్చిన అలియాస్ జానకి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గోపాల గోపాల చిత్రంలో జర్నలిస్టుగా కనిపించింది అనితా అంబ్రోస్.

anishaambrose pic talk

తెలుగే కాదు తమిళ్, కన్నడంలో కూడా ఆమె చిత్రాలు చేసింది. ఏ2 హ్యాండ లవర్, కర్వా అనే చిత్రాలతో పాటు వన్గాజర్ ఉళగం అనే తమిళ చిత్రంలో మెరిసింది. తెలుగులో రన్, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్, ఒక్కడు మిగిలాడు, ఉన్నది ఒకటి జిందగి, సెవెన్ వంటి పిక్చర్స్‌లో నటించింది. 2019 తర్వాత ఆమె కంప్లీట్ ఇండస్ట్రీ నుండి తప్పుకుంది. కారణం.. పెళ్లి. అనితా 2019 మేలో హైదరాబాద్‌కు చెందిన ఎంటర్ ప్రెన్యూర్ గుణనాథ్ జక్కాను వివాహం చేసుకుంది. వీరికి 2020లో బాబు పుట్టాడు. ఫ్యామిలీ లైఫ్ కోసం సినిమాల నుండి తప్పుకుంది. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. సరిగ్గా 10 ఏళ్ల కెరీర్ చూడకుండానే కనుమరుగైంది ఈ కుందనపు బొమ్మ. మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Anisha Ambrose (@anishaambrose_official)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio