iDreamPost
android-app
ios-app

OTT Competition : OTT సినిమాలు వెబ్ సిరీస్ తో ఓటిటిల పోటీ

  • Published Feb 17, 2022 | 11:20 AM Updated Updated Feb 17, 2022 | 11:20 AM
OTT Competition : OTT సినిమాలు వెబ్ సిరీస్ తో ఓటిటిల పోటీ

ఒకవేళ సన్ అఫ్ ఇండియా ఆప్షన్ గా పెట్టుకోకపోతే రేపు థియేటర్లో చూసేందుకు సినిమా ఏదీ లేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కు 18న ఓటిటి వినోదం మాములుగా లేదు. చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు క్యూ కడుతున్నాయి.నాగార్జున నాగచైతన్యల లేటెస్ట్ హిట్ ‘బంగార్రాజు’ జీ5లో ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ఇండియా మొదటి వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన ’83’ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఇతర భాషలు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన విశాల్ ‘ఎనిమీ’ని సోనీ లివ్ లో తీసుకొస్తున్నారు. విజయ్ సేతుపతి త్రిషల తమిళ కల్ట్ క్లాసిక్ ’96’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని ఆహాలో చూడొచ్చు.

శృతి హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘బెస్ట్ సెల్లర్’ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ తీసుకొస్తోంది. మిథున్ చక్రవర్తి డిజిటల్ డెబ్యూ ఇది. మలయాళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఇప్పటికీ హైదరాబాద్ లో రన్ అవుతున్న ‘హృదయం’ హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది. ఇవి కాకుండా శరత్ కుమార్ ‘ఇరై’ వెబ్ సిరీస్ ని ఆహా తమిళ్ లో ఇస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు లేదు. ఇవి కాకుండా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ లో ఇంగ్లీష్ మూవీస్, సిరీస్ లు కూడా వస్తున్నాయి. టెక్సాస్ చైన్ సా మసాకర్, డౌన్ ఫాల్, వన్ అఫ్ అజ్ లయింగ్,స్పేస్ ఫోర్స్ లాంటివిలో అందులో కొన్ని. అన్ని భాషలు ఫాలో అయ్యేవాళ్ళకు కంటెంట్ చాలా ఉంది

ఈ లెక్కన ప్రతి శుక్రవారం వినోదం కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా ఓటిటిలు ఈ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాయి. ఒకపక్క థియేటర్లకు పబ్లిక్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రెగ్యులర్ గా స్టార్ హీరోల చిత్రాలు రావడం లేదు. అందుకే జనం స్మార్ట్ స్క్రీన్లలో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి వెండితెరకు ప్రత్యాన్మయం కాకపోయినా గట్టి పోటీ ఇస్తున్న మాట వాస్తవం. ఇకపై ఏ ఫ్రైడే అయినా సరే ఇలానే ఉండబోతోంది. వీటి సంగతలా ఉంచితే తెలుగు హిందీ ఇంగ్లీష్ కలిపి రేపు సుమారు పదికి పైగా సినిమాలు థియేటర్లలో వస్తున్నాయి. దేనికీ కనీస బజ్ లేకపోవడం డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కు పండగే

Also Read : Akkineni Naga Chaitanya : అక్కినేని హీరోకు మంచి ఛాలెంజే