iDreamPost
android-app
ios-app

ప్రేయసి కోసం పురుషుడిగా మారాలనుకుంది.. మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా..!

ప్రేయసి కోసం పురుషుడిగా మారాలనుకుంది.. మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా..!

ప్రేమకు రంగు, కులం, గోత్రం, పేద, ధనిక భేదాలు ఉండవు అని చెబుతూనే ఉంటారు. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చూశాం కూడా. అయితే గత కొంతకాలంగా ప్రేమకు లింగ భేదం కూడా లేదని కొన్ని సంఘటనల్లో చూశాం. అంటే అబ్బాయిలు- అబ్బాయిలు, అమ్మాయిలు- అమ్మాయిలు ప్రేమించు కోవడం, వివాహం చేసుకోవడం కూడా చూశాం. అలాగే ఒక అమ్మాయి తన స్నేహితురాలిపై మనసు పడింది. ఆమెను గాఢంగా ప్రేమించింది. తనని పెళ్లి చేసకునేందుకు పురుషుడిగా కూడా మారాలి అనుకుంది. కానీ, చివరకు ఆమె ఆశ అడియాస అయ్యింది. తన జీవితం ఊహించని మలుపు తిరిగింది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ ప్రాంతంలో జరిగింది. ఆర్సీమిషన్ పరిధిలో నివసించే పూనమ్- ప్రీతి మంచి స్నేహితులు. క్రమంగా వారి మధ్య ఇష్టం ఏర్పడింది. అయితే ప్రీతి కోసం పూనమ్ అబ్బాయిగా కూడా మారాలి అని నిర్ణయించుకుంది. అందుకోసం ఒక మాంత్రికుడిని కూడా కలిసింది. ఏప్రిల్ 18న తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన అక్క కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వారికి కొన్ని రోజులకు నది ఒడ్డున ఒక అస్థి పంజరం దొరికింది. దానిని ల్యాబ్ లో పరీక్షించగా అది పూనమ్ అస్థిపంజరంగా తేలింది. పోలీసులకు ఈ కేసు పెద్ద సవాలుగా మారింది. విచారణ వేగంవతం చేయగా.. వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె తొలుత మాంత్రికుడిని కలిసింది అని వాళ్లు కూడా భావించారు. అయితే తర్వాత అసలు నిజం తెలిసింది. పూనమ్ ను పథకం ప్రకారం హత్య చేశారని. విషయం ఏంటంటే.. పూనమ్ వల్ల ప్రీతికి పెళ్లి సంబంధాలు రావడం లేదు. అందుకు ప్రీతి తల్లి ఊర్మిళ.. రామ్ నివాస్ అనే వ్యక్తికి మర్డర్ కాంట్రాక్ట్ ఇచ్చింది. పూనమ్ ను హత్య చేస్తే 2.5 లక్షలకు ఆఫర్ ఇచ్చింది. అడ్వాన్సుగా రూ.5 వేల నగదును అప్పజెప్పింది.

రామ్ నివాస్.. ప్రీతి- పూనమ్ లను ఆడవికి తీసుకెళ్లాడు. వారి వివాహం గురించి చర్చలు జరిపాడు. తాను మంత్రాలతో పూనమ్ ను పురుషుడిగా మారుస్తానంటూ నమ్మబలికాడు. అది నమ్మిన పూనమ్ అతను చెప్పిన రోజు మరోసారి అడవికి వెళ్లింది. పథకం ప్రకారం రామ్ నివాస్ పూనమ్ ను హత్య చేసి నది దగ్గర పడేశాడు. పూనమ్ వస్రాలు చూసి ఆమె సోదరుడు అవి పూనమ్ వే అంటూ గుర్తించాడు. ఈ కేసులో పోలీసులు రామ్ నివాస్, ప్రీతీలను అరెస్టు చేశారు. ఊర్మిళ పరారీలో ఉండగా.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి