సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా మాయలో జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఈ టెక్నాలజీని జీవితాలను బాగు చేసుకోవడానికి వాడుతుంటే.. ఇంకొందరు మాత్రం టైమ్ పాస్ కి, తమ జీవితాన్ని బుగ్గి పాలు చేసుకోవడానికి వాడుతున్నారు. ఫేస్ బుక్ లాంటి యాప్స్ లో చాటింగ్ నుంచి ఇప్పుడు అంతా వీడియో కాల్స్ వరకు వచ్చేసింది. అయితే టెక్నాలజీని చాలా మంది మంచికి వాడుతుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీతో తప్పుదోవ పడుతున్నారు. అలాంటి ఓ పని చేసిన యువతి చివరకి తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన జరిగింది. ఓ యువతికి ఫేస్ బుక్ లో న్యూటన్ బాబు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కొద్దిరోజుల్లోనే ఇష్టంగా మారింది. ఓరోజు ఆ యువతి న్యూటన్ బాబుతో న్యూ*డ్ డ్ వీడియో కాల్ మాట్లాడింది. అయితే న్యూటన్ బాబు ఆ కాల ని రికార్డ్ చేశాడు. తర్వాత ఆ యువతకి ఏలూరు జిల్లాకి చందిన యువకుడితో వివాహం సెట్ అయింది. ఈ గ్యాప్ లో ఆ యువతి వరుడితో కూడా శారీరకంగా దగ్గరైంది. వివాహం జరగాల్సిన సమయంలో న్యూటన్ ఆ వీడియో వరుడికి పంపాడు. ఆ వీడియో పెళ్లి పెద్దలకు చూపింది.
యువతి తీరు సరిగ్గాలేదని వరుడు పెళ్లికి అంగీకరించలేదు. ఆ తర్వాత ఆ వీడయో యువతి కుటుంబ సభ్యుల వద్దకు కూడా చేరింది. అలాగే ఆ న్వీడియో న్యూటన్ బాబు తన బంధువులను పంపాడు. వాళ్లు తర్వాత మరికొంతమందికి పంపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో పోలీసులు వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం 109, 120(బి) కింద కేసులు నమోదు చేశారు. ఒకరి వ్యక్తిగత వీడియోలు వేరే వారికి పంరితే వాటిని డిలీట్ చేయకుండా మరొకరికి షేర్ చేస్తే.. శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు.