iDreamPost
android-app
ios-app

ఆయిల్ ట్యాంకర్‌ బోల్తా.. నూనె కోసం ఎగబడిన స్థానికులు!

ఆయిల్ ట్యాంకర్‌ బోల్తా.. నూనె కోసం ఎగబడిన స్థానికులు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలానే వివిధ రకాల సరకులను తరలిస్తున్న వాహనాలు రోడ్లపై పడిపోతుంటాయి. ఈక్రమంలో అందులోని వస్తువుల కోసం స్థానిక జనం ఎగబడుతుంటారు.  ఇటీవలే కూరగాయాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి వాగులో బడింది. దీంతో స్థానికులు ఎగబడి మరీ.. అందులోని కూరగాయాలను తీసుకెళ్లారు. తాజాగా ఓ నూనె ట్యాంకర్ బోల్తా పడగా.. అందులోని ఆయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలోని పండ్వారా ప్రాంతంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. పిండ్వార ప్రాంతంలోని నాలుగు లైన్ల రహదారిలో ఆయిల్ తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.  బైక్ పై వెళ్తున్న వ్యక్తి ట్యాంకర్ కి ఎదురుగా వచ్చాడు. ఆ బైక్ ను తప్పించే ప్రయత్నంలో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది.దీంతో ట్యాంకర్ లోని ఆవనూనె రోడ్డుపై పారింది. ప్రమాదం గురించి..సమాచారం అందుకున్న స్థానికులు అక్కడి చేరుకున్నారు. ఒట్టి చేతులతో కాకుండా బాటిల్స్‌, పాత్రలు, బకెట్లతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ట్యాంకర్‌ నుంచి కారుతున్న నూనెను వాటిల్లో పట్టుకునేందుకు  జనం ఎగబడ్డారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలానే ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. అయితే నూనె కోసం స్థానికులు ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. తోటి వారు ప్రమాదంలో ఉన్న విషయం మరచి.. ఇలా నూనె కోసం ఎగబడటం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చీరల కోసం కొట్టుకున్న మహిళలు.. కాల్పులకు తెగబడిన భర్తలు!