ఎప్పుడు, ఎలాంటి ప్రమాదాలు ముంచుకొంచస్తాయో ఎవ్వరం చెప్పలేము. మనం ఒకటి తలిస్తే.. విధి ఒకటి జరిపిస్తుంది. అలానే క్షణం ముందు ఎంతో హాయిగా కనిపించిన వారు.. ఆ తరువాత విగతజీవులుగా మారుతున్నారు. అలానే ఓ జంట విషయంలో చోటుచేసుకుంది. త్వరలో ఒకటి కాబోతున్న ఆ జంట కూడా విధి ఆడిన నాటకంలో బలైంది. విమానం ఆలస్యం కావడంతో ఓ హోటల్ లో బస చేసేందుకు వెళ్లారు. అక్కడ సంభవించిన అగ్ని ప్రమాదం ఆ ఎన్నారై జంట బలైపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని ముంబైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం మహారాష్ట్ర లోని ముంబైలోని సాంతాక్రూజ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఓ జంట ఉన్న విషయం వెలుగు చూసింది. కాబోయే వధువరులు గుజరాత్‌కు చెందిన కిషన్ హలాయ్ (28), అతడికి కాబోయే భార్య రూపాల్ వెకారియాల (25) కుటుంబు సభ్యులు కెన్యా రాజధాని నైరోబికి వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. కిషన్ సోదరుడి వివాహం కోసం నెలల క్రితం ఇరు కుటుంబాలు గుజరాత్‌కు వచ్చాయి.
కిషన్ తల్లిదండ్రులతోపాటు అతడి సోదరుడి జంట వారం క్రితమే తిరిగి కెన్యా వెళ్లారు. కిషన్, రూపాల్‌కు కూడా ఇటీవలే పెళ్లి కుదిరింది. కెన్యాకు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కెన్యా వెళ్లేందుక వీరు సిద్ధమయ్యారు. ఆగస్టు 27న ముంబై విమానశ్రయం చేరుకున్నారు. అయితే, వారు వెళ్లాల్సిన విమాన ఆలస్యం అయింది. దీంతో కిషన్, రూపాల్, ఆమె తల్లి, సోదరికి స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో సదరు విమానయాన సంస్థ బస ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే వారు బస చేసిన హోటల్ లో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రూపాల్ తల్లి, చెల్లెలితో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోనే వివాహం చేసుకోనున్న ఈ జంట ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయాలు నెలకొన్నాయి. మూడుముళ్ల బంధంతో మరికొన్ని రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన ఆ యువ జంటపై విధి కన్నెర్ర చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించి..స్వామీజీ విచిత్రమైన డిమాండ్!