Prakash Raj MAA Elections : ‘మా’ క్లైమాక్స్ ఇప్పట్లో ఉండదు

అంతా అయిపోయింది. రేపు మంచు విష్ణు టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు ఇంకే గొడవలు ఉండవనుకుంటున్న తరుణంలో ప్రకాష్ రాజ్ మాత్రం దీన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తన ప్యానెల్ మూకుమ్మడి రాజీనామాల తర్వాత మోహన్ బాబు బృందం వ్యూహాత్మక మౌనం పాటించడం ఊహించనిది. నరేష్ రెండు మూడు మాటలు తూలాడు కానీ అవేవి మీడియాలో అంతగా హై లైట్ కాలేకపోయాయి. ఇక ప్రత్యర్థి వర్గంలోని గెలిచి మరీ ఈసి మెంబర్లు చేసిన రిజిగ్నేషన్ల పట్ల విష్ణు స్పందన అధికారికంగా ఆ పోస్టులో కూర్చున్నాకే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అది రేపే జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ప్రకాష్ రాజ్ మాత్రం ఈ వ్యవహారాన్ని వీలైనంత దూరం తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నిన్న ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్ కు లేఖ రాస్తూ ఆ రోజు కౌంటింగ్ కేంద్రంలో జరిగిన సిసి ఫుటేజ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా ఇవ్వాలని లేకపోతే డేటా డిలీట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా అందులో పేర్కొనడం విశేషం. ఫుటేజ్ భద్రంగా ఉందనే సమాధానం వచ్చింది కానీ పూర్తిగా బయటికి ఇస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. విష్ణు బాధ్యతలు స్వీకరించాక చాలా కీలక పరిణామాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాల్లో తనవాళ్ళను తీసుకుంటాడా లేదా అనేది కూడా సస్పెన్స్.

ఇక్కడితో అయిపోలేదు. ప్రకాష్ రాజ్ ఇటీవలే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇది ఓటమి చెందాక షూట్ చేసిందని ప్రోమోలను చూస్తే అర్థమైపోతుంది.సో ఇందులో కొన్ని సంచలనాత్మక విషయాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మా వేరు కుంపటి, ఇంత జరుగుతున్నా చిరంజీవి సైలెంట్ గా ఉండటం లాంటివి ప్రశ్నల రూపంలో ఎదురయ్యాయి. సో దీని మీద కూడా ఇండస్ట్రీ పెద్దలు కన్నేశారు. మొత్తానికి మా ఎపిసోడ్లు ఎప్పుడు పూర్తవుతాయో అంతు చిక్కడం లేదు. రేపటి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు ఎవరెవరు రాబోతున్నారనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది

Also Read : Mahesh PAN India Film : టైమొచ్చేసింది అంటున్న మహేష్

Show comments