iDreamPost
android-app
ios-app

ఓటిటి లెక్కలు – ఆ ఒక్కటీ అడక్కు

  • Published Sep 15, 2021 | 7:58 AM Updated Updated Sep 15, 2021 | 7:58 AM
ఓటిటి లెక్కలు – ఆ ఒక్కటీ అడక్కు

ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ రెండు కొత్త రికార్డులు సొంతం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమాగా ప్లస్ ఇప్పటిదాకా వచ్చిన చాలా చిత్రాల లైఫ్ టైం వీక్షణలను దాటేసినట్టుగా అందులో పేర్కొంటున్నారు. అంటే వెంకటేష్ నారప్పను కూడా జగదీష్ దాటేశాడన్న మాట. దీనికి నిర్మాణ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ భారీ ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. అత్యధిక సర్కులేషన్ ఉన్న దినపత్రికలో ఒకే రోజు రెండు ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం బాహుబలి కూడా చేయలేదు. ఆ రేంజ్ లో ఖర్చు పెట్టారు.

కానీ అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయో మాత్రం ప్రైమ్ బయట పెట్టడం లేదు. ముందు నుంచి దీని వ్యవహారం ఇంతే. ఏ సినిమా అయినా యుట్యూబ్ తరహాలో ఎంతమంది చూశారనే లెక్కలు ఎప్పటికీ బయటికి రావు. ఆయా నిర్మాతలతో అంతర్గతంగా పంచుకుంటారని మాత్రం తెలిసింది. అది కూడా అగ్రిమెంట్ ప్రకారం బయట ఎక్కడా చెప్పకూడదు అనే కండిషన్ మీదే. అందుకే ప్రైమ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయనేది సమాధానం దొరకని భేతాళ ప్రశ్న. ఇప్పటికీ ఆకాశం నీ హద్దురా తాలూకు వివరాలు తెలియక సూర్య ఫ్యాన్స్ పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.

బాక్సాఫీస్ దగ్గరైతే ఫలానా రోజు ఇంత కలెక్షన్ వచ్చింది ఫైనల్ రన్ కి ఇన్ని ఫిగర్స్ నమోదయ్యాయి అంటూ లక్షలు కోట్లు లెక్కలు ఏదో రూపంలో బయటికి వస్తాయి. దీన్ని బట్టి హిట్టో ఫ్లాపో డిసైడ్ అవుతుంది. కానీ ఓటిటి వ్యవహారం అలా కాదు. పదుల కోట్లు పెట్టి హక్కులు కొన్న సంస్థలు అంత మొత్తాన్ని ఏ రూపంలో తిరిగి రాబట్టుకుంటాయో మధ్య తరహా కంప్యూటర్ జ్ఞానం ఉన్నవాళ్లు కూడా అంత ఈజీగా చెప్పలేరు. అసలు ప్రైమ్ లోనే జగదీష్ ని ఇందరు చూశారంటే ఇక పైరసీ వెర్షన్లు, లోకల్ కేబుల్ ఛానల్ టెలికాస్టులు వెరసి టక్ జగదీష్ టీమ్ కోరుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ శాతం రీచ్ అయ్యిందనే మాట మాత్రం వాస్తవం

Also Read : RRR వాయిదా – ఎందరికో వరం