iDreamPost
android-app
ios-app

రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవెటు భూమి సేకరించవద్దు

రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవెటు భూమి సేకరించవద్దు

శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమరనాద్ మాట్లాడుతూ విశాఖ పట్టణంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకి ఎంత భూమి కావాలని ముఖ్యమంత్రిని అడిగినప్పుడు, మన ప్రభుత్వం రైతుల నుండి ఒక్క సెంటు అంటే ఒక్క సెంటు భూమి కూడా తీసుకోవడం లేదని తేల్చి చెప్పారని, కేవలం మూడు వేల ఎకరాలలోనే అదికూడా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని అమరనాద్ అసెంబ్లీలో పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఏర్పడిన 70 ఎళ్ల తరువాత విశాఖ పట్టణానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగిన గుర్తింపు లభించిందని ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గాయపడ్డాయని అమరనాద్ ఆరోపించారు. శాసనమండలిలో తీసుకున్న నిర్ణయాలని శాసనసభలో ఎలా చర్చిస్తారంటూ కొందరు తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తన్నారని, మరి శాసనసభలో కాక వారికి అనుకూలమైన మీడియా కార్యాలయాల్లో చర్చిస్తారా అని అమరనాద్ ఎద్దేవా చేశారు.

Read Also: మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

ప్రజల ఆకాంక్షలకు అనుగుణముగా, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను శాసనమండలి ద్వారా ప్రతిపక్షం దొడ్డిదారిన అడ్డుకుంటుందని, అందుకనే గతంలో యన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారని అమరనాద్ గుర్తు చేశారు. మేధావులు, విద్యావంతులు ఉండాల్సిన శాసనమండలిని చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు, ఆర్ధిక నేరస్థులతో నింపేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో తరతారాలుగా వెనుకబడిపోయిందని, అలాంటి ప్రాంతానికి మేలు జరిగేలా, ఆ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా కార్య నిర్వాహక రాజధానిని విశాఖపట్టణంలో పెడుతుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోంది ఆరోపించారు.

అల్లూరి సీతారామ రాజు, గురజాడ అప్పారావు, తెన్నేటి విశ్వనాధం లాంటి ఎందరో ప్రముఖులు తిరుగాడిన విశాఖపట్టణం సహజ సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు, ఒకపక్క బంగాళాఖాతం, ఒకపక్క అందమైన కనుమలతో ఒక్క ఉత్తరాంధ్ర వాసులనే కాకా రాష్ట్రవ్యాప్తంగా ఏంతో మందిని ఆదరించి అన్నం పెట్టిందని అయన అన్నారు

Read Also: ఇద్ద‌రు మంత్రులు భవిషత్తు ?

ఉత్తరాంధ్రకు ముఖ ద్వారంగా ఉన్న విశాఖపట్టణం భవిష్యత్ లో ఆంద్ర ప్రజల కలల నగరంగా మారనుందని కట్టమంచి రామలింగా రెడ్డి గారు ఎప్పుడో చెప్పారని అమరనాద్ సభ కి గుర్తు చేశారు. విశాఖ నగరం జీడీపీలో దేశంలోనే 9 వ స్థానం దక్కించుకుందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్టణం ఎంతోమంది బయటినుండి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి వారికి రాజకీయంగా, వ్యాపారపరంగా ఉన్నత అవకాశాలు కల్పించిందని అలాంటి ప్రాంతంపై గత నెలరోజులుగా మీడియా ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, లేని మావోయిస్టు సమస్యను బూచిగా చూపి అసత్య ప్రచారాలు చేస్తూ ఈ ప్రాంతంపై విషం చిమ్మే కుట్ర జరుగుతుందని అమరనాద్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో నీటి కోసం ఉద్యమాలు చేస్తుంటే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు తన భూముల ధరలు పెంచుకోవడానికి ఉద్యమం చేస్తున్నారని అమరనాద్ ఎద్దేవా చేశారు.