iDreamPost
android-app
ios-app

ఇంకే డౌట్లు వద్దంటున్న జగదీష్

  • Published Aug 17, 2021 | 7:36 AM Updated Updated Aug 17, 2021 | 7:36 AM
ఇంకే డౌట్లు వద్దంటున్న జగదీష్

విశ్వసనీయ సమాచారం మేరకు న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీష్ ప్రైమ్ లో రావడం దాదాపు ఖాయమే. నిర్ణయం మార్చుకున్నారని థియేటర్లకే వస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది కానీ ఫైనల్ గా డిజిటల్ లోనే రానున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇప్పటికే ట్రైలర్ కట్ జరిగిందని, డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ త్వరలోనే దాన్ని ఆన్ లైన్ లో వదిలే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సెప్టెంబర్ 10 వినాయకచవితి పండగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయొచ్చని అంటున్నారు. నిజానికి ఈ నెలలోనే ఇది జరగాల్సి ఉన్నప్పటికీ ఏవో కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఫెస్టివల్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టు వినికిడి.

అసలు ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్లు లేకపోవడం నాని ఫ్యాన్స్ ని నెలరోజులకు పైగా కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఏదో ఒకటి చెప్పేస్తే దానికి తగ్గట్టు ప్రిపేట్ అవుతాం కదాని వాళ్ళ అభిప్రాయం. కానీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం సైలెంట్ గానే ఉంటూ వచ్చింది. మరోవైపు చిన్నవి మీడియం రేంజ్ వి అన్నీ పోటీ పడి మరీ థియేట్రికల్ రిలీజులు ప్రకటించుకుంటున్నాయి. వారానికి కనీసం ఆరు సినిమాలతో బాక్సాఫీస్ బాగా బిజీగా ఉంది. ఇందులో అంతో ఇంతో పాజిటివ్ టాక్ వచ్చినవి కూడా మొదటి మూడు రోజుల జోరుకే పరిమితమై తర్వాత స్లో కావడం పెద్ద నిర్మాతలను ధైర్యంగా ముందుకు రానివ్వడం లేదు.

ఒకవేళ ప్రైమ్ కనక టక్ జగదీష్ డేట్ సెప్టెంబర్ 10కి లాక్ చేసుకుంటే భారీ స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాని మూవీ కనక వ్యూస్ గట్టిగా వస్తాయి. నారప్పతో ఇదే తరహాలో గత నెల వర్కౌట్ చేసుకున్న ప్రైమ్ దానికన్నా ఎక్కుడ స్పందన దీనికి ఆశిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. నాని గత చిత్రం వి కూడా డిజిటల్ లోనే రావడం గమనార్హం. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు గట్రా ఎప్పటి నుంచి మొదలుపెడతారో చూడాలి మరి

Also Read : హద్దులు దాటేస్తున్న అభిమానుల పైత్యం

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş