iDreamPost
android-app
ios-app

నితిన్ పెళ్లికి తప్పని బ్రేకులు

  • Published Mar 26, 2020 | 6:45 AM Updated Updated Mar 26, 2020 | 6:45 AM
నితిన్ పెళ్లికి తప్పని బ్రేకులు

చిన్నా పెద్ద తేడా లేకుండా కోవిడ్ 19 అందరి మీద డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే జనం బయటికి రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఓవరాక్షన్ చేసి రోడ్లకు మీదకు ఎవరైనా వస్తే పోలీస్ బాబాయ్ లు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎందుకొచ్చిన గొడవని మరీ అర్జెంటు ఉంటే తప్ప జనం బయటికి రావడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడీ కరోనా ఎఫెక్ట్ నితిన్ పెళ్ళికి కూడా చుట్టుకుంది.

ముందు అనుకున్న ఏప్రిల్ 16న మ్యారేజ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఇరు కుటుంబాలు వాయిదా నిర్ణయం తీసుకున్నాయి. దుబాయ్ లో పెళ్లి చేసి హైదరాబాద్ లో రిసెప్షన్ ఇవ్వాలని ముందు అనుకున్న ప్లాన్. కానీ ఇప్పుడు రెండు చోట్లా పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఒకవేళ సింపుల్ గా చేసుకుందామన్నా అది అంత ఈజీ కాదు. కావాల్సిన కుటుంబ సభ్యులను కట్టడి చేసుకుని సీక్రెట్ గా చేసుకుంటే అందులో మజా ఉండదు. అందుకే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాక అప్పుడు నిర్ణయం తీసుకుంటారట. తన స్నేహితురాలు షాలినిని ప్రేమించి ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న నితిన్ కు ఇది ఊహించని పరిణామమే.

వైరస్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతుగా 10 లక్షల విరాళం ప్రకటించిన నితిన్ ఈ విషయంలో సీనియర్ హీరోల కంటే ముందున్నాడు. ఇటీవలే భీష్మతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ యువ హీరో దాని రూపంలో మరో ఫిఫ్టీ డేస్ మూవీ తన అకౌంట్ లో వేసుకునేవాడే. కానీ మంచి రన్ కొనసాగుతున్న సమయంలోనే భీష్మ స్క్రీన్లు కరోనా వల్ల మూతబడిపోయాయి. రెండు సూపర్ న్యూస్ ల మధ్య పెళ్లి వాయిదా అనేది సమాజం కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరు హర్షిస్తున్నారు. నితిన్ ప్రస్తుతం రంగ్ దేతో పాటు అందాదున్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి సద్దుమణిగాక వీటి షూటింగులు కొనసాగించబోతున్నాడు .

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş