iDreamPost
android-app
ios-app

నిర్భయ దోషులకు 20న ఉరి.. నేడు తీహార్ జైల్లో డమ్మీ ఉరి

  • Published Mar 18, 2020 | 5:20 AM Updated Updated Mar 18, 2020 | 5:20 AM
  • Published Mar 18, 2020 | 5:20 AMUpdated Mar 18, 2020 | 5:20 AM
నిర్భయ దోషులకు 20న ఉరి.. నేడు తీహార్ జైల్లో డమ్మీ ఉరి

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈనెల 20న ఉరి తీసేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కేసులో నలుగురు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా విచారణ ప్రారంభమైన కొన్నాళ్ళకు రాం సింగ్ అనే నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా బాల నేరస్థుడు ఒకరు బెయిల్ మీద విడుదల అయ్యారు. మిగిలిన నలుగురు
ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ జైలు నుంచి తలారీ పవన్ జల్లాది తీహార్ జైలుకు వచ్చారు.

నిర్భయ దోషుల ఉరికి ముందు వారి బరువును బట్టి ఇసుక బస్తాలతో తిహార్ జైలు గదిలో బుధవారం డమ్మీ ఉరి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఒక వైపు నిర్భయ దోషుల ఉరికి తిహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచార ఘటన జరిగినపుడు తాను మైనర్‌నని, అందుకే తన ఉరిని రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని పవన్ కుమార్ గుప్తా కోరాడు. దీంతో పాటు మరో దోషి అక్షయ్ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని జైలు అధికారులకు రెండోసారి పిటిషన్ సమర్పించాడు. జైలు అధికారులు దీన్ని కేంద్ర హోం శాఖకు పంపించారు. నిర్భయ దోషులు నలుగురికి ఈ నెల20న ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలోనే లేనని ముకేష్ సింగ్ పెట్టిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom