iDreamPost
android-app
ios-app

ఆ హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ రమేష్ రహస్య భేటి

  • Published Jun 23, 2020 | 6:55 AM Updated Updated Jun 23, 2020 | 6:55 AM
ఆ హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో నిమ్మగడ్డ రమేష్ రహస్య భేటి

రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమైన మాజీ ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇన్నిరోజులు అధికార పార్టి చెబుతునట్టుగానే తెలుగుదేశానికి అత్యంత సన్నిహితులుగా మెలిగే వ్యక్తులతో ఆయనకు సంభందాలు ఉన్నాయనే అంశం ఇప్పుడు ఒక ప్రముఖ చానల్ ప్రసారం చెసిన వీడియో తో సాక్షాలతో సహా తాజాగా బయటికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పై ఏకపక్షంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిమ్మగడ్డ రాసిన లేఖపై అనేక అనుమానాలు బలపడుతున్న వేల ఆయన జరిపిన భేటితో నిమ్మగడ్డ వ్యవహారంలో ఉన్న గూడుపుఠానీ వెనక ఉన్న పెద్దలు ఎవరు అనే అంశం ఇప్పుడు దాదాపుగా రూడి అయినట్టుగానే భావించాలని పలువురు చెబుతున్న మాట .

ఇక వివరాల్లోకి వెలితే

ఈ నెల 13వ తారీఖున నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైద్రబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో 8వ ప్లోర్ లో ఉన్న ఒక గదిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉండి ప్రస్తుతం బీజేపీ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో సుమారు గంటన్నర పాటు రహస్యంగా బేటి అయ్యారు. సరిగ్గా ఈ నెల 13వ తారీఖున ఉదయం 10:47 నిమషాలకు మొదట సుజనా చౌదరి హోటల్ కి రాగా , ఆ తరువాత కామినేని శ్రీనివాస్ 11:23 నిమిషాలకు వచ్చారు ఇక చివరగా 11:44 నిమిషాలకు నిమ్మగడ్డ రమేష్ కూడా హోటల్ కి చేరుకుని 8వ అంతస్తులో ఉన్న ఒక గదిలో భేటి అయ్యారు. వీరి ముగ్గురుని ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడం వారు ముగ్గురు విడివిడిగా ఒకే గదిలోకి వెళ్ళడం సుమారు 1:30 వరకు భేటి అవ్వడం ఆ తరువాత అ గదిలో నుండి ఒకొక్కరుగా విడిగా బయటికి వచ్చి ఎవరి దారిన వారు వెళ్ళుపోవడం మొత్తం తతంగం హోటల్ సీసీ ఫూటేజ్ లో స్పష్టంగా రికార్డు అయింది. ఇప్పుడు ఆ ఫూటేజ్ ని ప్రముఖ మీడియా సంస్థ బయట పెట్టడంతో వీరు నడిపిన రహస్య భేటి దృశ్యాలు బహిర్గతం అయ్యాయి.

రాజ్యంగ బద్దమైన పధవిలో ఉన్న అధికారి తెలుగుదేశానికి అత్యంత సన్నిహితులుగా మెలిగే వ్యక్తులని అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఆ భేటిలో ఏమి జరిగింది. ఆ భేటి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎంటి? లాంటి అనేక అనుమానాలకు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పి తీరాల్సిన సమయం వచ్చింది. దీనిపై తెలుగుదేశం నేతలు , నిమ్మగడ్డ రమేష్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.