సినిమా పబ్లిసిటీ కోసం కొత్త స్టంటులు

ఒకప్పుడు సినిమా పబ్లిసిటీకి పోస్టర్లే ఆధారం. రిలీజ్ రోజు గోడ మీద చూసి జనం వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునేవారు. తర్వాత టీవీ వచ్చాక దీంట్లో మార్పు వచ్చింది. టెక్నాలజీ పెరిగాక సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి చిన్న అప్ డేట్ ని వీటిద్వారానే షేర్ చేసుకోక తప్పని పరిస్థితి. ఒకవేళ ఫాలో కాకపోతే ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇలా చేయని కారణంగానే ఇటీవలే రిలీజైన ఆర్ నారాయణమూర్తి రైతన్న అసలు విడుదలయిందన్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఆన్ లైన్ మీడియా ప్రభావం ఆ రేంజ్ లో ఉంది మరి. కానీ ఇప్పటి మేకర్స్ కు ఇది సరిపోవడం లేదు. దిల్ మాంగే మోర్ తరహాలో కొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి.

విషయానికి వస్తే ఈ నెల 10న జీ5లో రాహుల్ రామకృష్ణ అవికా గోర్ తదితరులు నటించిన ఓటిటి మూవీ నెట్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇదంతా సరిపోదనుకున్నాడో ఏమో రాహుల్ రామకృష్ణ ట్విటర్ ని వేదికగా చేసుకుని నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. మా సినిమాకు డాష్(ఇక్కడ బూతు పదం వాడారు)ఉంది అని అందులో ప్రస్తావించాడు. దీంతో నెటిజెన్లు సహజంగానే నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు. అక్కడితో రాహుల్ ఆగలేదు. ఓహో ఇక్కడ అందరూ పతితులే ఉన్నారన్న మాట అంటూ వ్యంగ్యంగా మరో ట్వీట్ చేయడంతో ఇది ఇంకాస్త వైరల్ అయ్యింది.

ఎంత వెటకారంగా అన్నా రాహుల్ చర్య సమర్ధనీయం కాదు. నిజంగానే ట్విట్టర్ లో పతితులు కూడా ఉంటారు. మంచి చెడు అన్ని రకాల ఉద్దేశాలు కోసం ఈ ప్లాట్ ఫార్మ్ ని వాడటం సహజం. అంత మాత్రాన పెట్టిన ట్వీట్ తప్పన్న కారణంగా అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు. అసలే 10న నాని టక్ జగదీష్ ఓటిటిలో, గోపీచంద్ సీటిమార్ థియేటర్లలో వస్తోంది. అదే రోజు రానున్న తమ నెట్ కి బజ్ రావాలంటే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ ఏదో చేయాలని రామకృష్ణ ముందే డిసైడ్ అయ్యాడేమో. ఆ మధ్య పాగల్ విషయంలోనూ విశ్వక్ సేన్ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. తీరా చూస్తే సినిమా యావరేజ్ గా మిగిలి పరువు తీసింది

Also Read : రామ్ చరణ్ సినిమా లేటవుతుందా ?

Show comments