iDreamPost
android-app
ios-app

అవికా గోర్ కు చేదు అనుభవం! అక్కడ అసభ్యంగా తాకాడంటూ ఎమోషనల్!

  • Published Jun 18, 2024 | 3:57 PMUpdated Jun 18, 2024 | 6:02 PM

Avika Gor: అవికా గోర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీగా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు ఎదురైన ఛేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

Avika Gor: అవికా గోర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీగా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు ఎదురైన ఛేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

  • Published Jun 18, 2024 | 3:57 PMUpdated Jun 18, 2024 | 6:02 PM
అవికా గోర్ కు చేదు అనుభవం! అక్కడ అసభ్యంగా తాకాడంటూ ఎమోషనల్!

‘అవికా గోర్’.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే.. బాలనటిగా బుల్లితెర పై అడుగు పెట్టిన ఈ బ్యూటీ ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కాగా, ఈమె మొదటిగా ‘బాలికా వధు’ అనే  హిందీ సిరీయల్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక ఆ సీరియల్ లే తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురి’గా టెలికాస్ట్ అయ్యింది. ఇక అప్పటిలో ఈ సీరియల్ ద్వారా అవికా గోర్ దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకైతే ఆమె అందం, అభినయంతో కట్టిపడేసిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. బుల్లితెరనుంచి వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. ఈ క్రమంలోనే మొదట రాజ్ తరణ్ సరసన ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ఆడియాన్స్ కు దగ్గరైంది. ఇక అందులో అవికా అద్భుతమైన నటనకు గాను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గురించి పంచుకుంది. ఇంతకి ఏమైందంటే..

బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్.. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే అందం, టాలెంట్ ఉన్నా ఈ అమ్మాడుకి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం కనుమరుగయ్యాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా తనకు ఓ ఈవెంట్ లో ఎదురైనా చేదు అనుభవం గురించి పంచుకుంది. అయితే కజక్‌స్థాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో తనకి ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అవికా చెప్పింది. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కజక్‌స్థాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌ గురించి నేను కారు దిగి నడుస్తున్న సమయంలో.. ఎవరో వెనక నుంచి నన్ను తాకినట్లు అనిపించింది. దీంతో వెనక్కి తిరిగి చూస్తే.. బాడీగార్డ్ మాత్రమే అక్కడ ఉన్నాడు. అయితే ఏదో అనుకోకుండా జరిగిందేమోనని నేను అనుకున్నాను. కానీ, మళ్లీ నేను వేదికపైకి ఎక్కి వెళ్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి మరోసారి అసభ్యంగా తాకాలని ట్రై చేశాడు.

కానీ, నేను వెంటనే గమనించి అతని చేయి పట్టుకొని.. ఏం చేస్తున్నావని నిలదీశాను. దీంతో అతను సారీ చెప్పాడు. ఇక నేను కూడా ఏం చేయలేక ఆ ఘటనను అక్కడితో వదిలేశాను. కానీ నాకు ధైర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని ఇప్పటికే నేను కొట్టేదాన్ని. కానీ అప్పట్లో అంత ధైర్యం నాకు లేదు. కానీ ఇప్పుడు కనుక ఇలాంటివి ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా మారాయి. కానీ, ఇప్పుడు అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. అయితే ఇలాంటి పనులు చేసేవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే కొన్ని పనులు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది మీరు గుర్తుంచుకోవాలి’ అంటూ అవికా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అవికా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, అవికా గోర్ కు ఎదురైన చేదు అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి