రామ్ చరణ్ సినిమా లేటవుతుందా ?

By iDream Post Aug. 30, 2021, 02:30 pm IST
రామ్ చరణ్ సినిమా లేటవుతుందా ?

లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఆగిపోయాక తిరిగి ప్రారంభం కాదేమోనని భయపడుతున్న ఇండియన్ 2 వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా వెళ్తోందని ప్రముఖ తమిళ మీడియా పత్రిక వికటన్ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ కు ముందు క్రేన్ ప్రమాదం జరిగి ముగ్గురి ప్రాణాలు పోయాక ఆగిన షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ కాలేదు. ఈలోగా నిర్మాతలకు దర్శకుడు శంకర్ కు మధ్య ఏవో ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి విభేదాలు రావడంతో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈలోగా కమల్ హాసన్ బిగ్ బాస్ షో, ఎన్నికల ప్రచారం. విక్రమ్ మూవీ తాలూకు ఏర్పాట్లలో బిజీ అయిపోవడంతో దాని ఊసు లేకుండా పోయింది

సో ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 తెరమీదకు రావడంతో శంకర్ రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకున్న భారీ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ విక్రమ్ కనక లేట్ అయితే ఆ గ్యాప్ లో దీన్ని పూర్తి చేయొచ్చు. కానీ ఇక్కడ చెప్పుకున్నంత తేలికగా శంకర్ వ్యవహారాలు ఉండవు. ఆల్రెడీ చరణ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. క్యాస్టింగ్ ఒక్కొక్కరిని ఫైనల్ చేసి డేట్లు కూడా తీసుకుంటున్నారు. తమన్ ట్యూన్స్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శంకర్ స్క్రిప్ట్ ని ఒక షేప్ కి తీసుకురావడం కోసం తన టీమ్ తో చెన్నై హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారు.

చరణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేశారు. ఆచార్య ఇంకొంచెం బ్యాలన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చేసేది శంకర్ దే. మరి ఈ దర్శకుడు ఏం చేయబోతున్నారో వేచి చూడాలి. ఇప్పుడు ఇండియన్ 2 కోసం ఎంత టైం అవసరం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 60 శాతం కంప్లీట్ చేశారు. అంటే బ్యాలన్స్ మరీ తక్కువేమీ లేదు. ఎంతలేదన్నా మూడు నాలుగు నెలలు అవసరమవుతాయి. మరి విక్రమ్ కి ఎంత టైం కేటాయించారో తెలిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ లాంటి క్యాస్టింగ్ గట్టిగానే ఉన్నారు. ఇప్పటికే వంద కోట్ల బడ్జెట్ దాటేసిందట

Also Read : వెరైటీ టైటిల్స్ తో వస్తున్న కింగ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp