iDreamPost

హారర్ మూవీస్ ఇష్టమా? OTTలో ఈ మూవీని ఒంటరిగా చూసే దమ్ముందా?

Avika Gor Horror Action Thriller: అవికా గోర్ ని క్యూట్ గా.. లవ్ స్టోరీల్లో చూశారు. కానీ, ఎప్పుడైనా హారర్ చిత్రంలో చూశారా? ఒక పుల్ లెంగ్త్ హారర్ చిత్రంలో అవికా అలరించింది. మీరు ఇంకా చూడకపోతే మాత్రం ఒకసారి చూసేయండి.

Avika Gor Horror Action Thriller: అవికా గోర్ ని క్యూట్ గా.. లవ్ స్టోరీల్లో చూశారు. కానీ, ఎప్పుడైనా హారర్ చిత్రంలో చూశారా? ఒక పుల్ లెంగ్త్ హారర్ చిత్రంలో అవికా అలరించింది. మీరు ఇంకా చూడకపోతే మాత్రం ఒకసారి చూసేయండి.

హారర్ మూవీస్ ఇష్టమా? OTTలో ఈ మూవీని ఒంటరిగా చూసే దమ్ముందా?

ఎప్పుడు చెప్పుకునే మాటే.. హారర్ చిత్రాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్. కానీ, వాటిని చూడకుండా ఉండమంటే మాత్రం కష్టమనే చెప్పాలి. మీకు నిజంగానే హారర్ చిత్రాలు చూడటం అంటే ఇష్టమైతే.. ఈ మూవీని అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే హారర్ మూవీస్ లవర్స్ కి కూడా ఇది వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంతేకాకుడా ఈ మూవీలో మన అందరికీ తెలిసిన చిన్నారి పెళ్లికూతురు ఒక మంచి హారర్ కథతో వచ్చేసింది. ఒక్కో సీన్ కి ఒంటరిగా చూడాలి అంటే దడ పుట్టేస్తుంది. మరి.. ఆ మూవీ ఏది? అసలు అంత భయపెట్టే అంశం ఆ సినిమాలో ఏముంది? నిజంగానే ఆ చిత్రంలో అంత విషయం ఉందా తెలుసుకుందాం.

మీ అందరికీ అవికా గోర్ అనగానే చిన్నారి పెళ్లి కూతురు గుర్తొస్తుంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు అయితే ఉయ్యాలా జంపాలా సినిమా స్ట్రైక్ అవుతుంది. చూడటానికి ఎంతో అమాయకంగా, క్యూట్ గా ఉండే అవికా గోర్.. అందరినీ భయపెట్టే సినిమా ఒకటి తీసిందని మీకు తెలుసా? ఆ మూవీ చూస్తే ఒక్కో సీన్ కి వణికిపోతారు. కథ, ట్విస్టులు, స్క్రీన్ ప్లే ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. కానీ, హారర్ చిత్రాల్లో ఒక కొత్తదనం, టేకింగ్, హారర్ ఎలిమెంట్స్ విషయంలో మాత్రం ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో భయపెట్టే అంశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇంక సినిమా విషయానికి వస్తే.. ఇందులో తన తండ్రి ఆత్మహత్యకు ప్రతీకారం కోసం అవికా గోర్ రగిలిపోతూ ఉంటుంది. అలాంటి ఆమెకు స్వయంగా తన తండ్రి ఆత్మే ఎదురై ప్రతీకారం తీర్చుకోవాలని అవికాని కోరుతుంది. తన తండ్రి ఆత్మ చెప్పిన విధంగా తన తల్లి దగ్గరకు అవికా గోర్ వెళ్తుంది. అయితే ఆమెకు వేరే వ్యక్తి వివాహం జరిగి ఉంటుంది. ఆ కుటుంబాన్ని అంతం చేయాలి అని ఆత్మ అనుకుంటుంది. ఆత్మ చెప్పిన విధంగా ఒక్కో పనిని అవికా గోర్ చేస్తూ వెళ్తుంది. అలా ఆ ఇంట్లో ఉండే చిన్న అమ్మాయికి ఆత్మ ఆవహించేలా చేస్తుంది. ఆ చిన్నారికి ఆత్మ ఆవహించిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది.

ఇంట్లో ఎవరి ప్రాణాలకు రక్షణ ఉండదు. ఆత్మ ఎప్పుడు ఎవరిని చంపుతుందో అనే కంగారు ఉంటుంది. చివరికి అవికా గోర్ కు కూడా ఆత్మ నుంచి రక్షణ ఉండదు. అసలు తాను ఇలాంటి తప్పు ఎందుకు చేశాను అని ఎంతో బాధ పడుతూ ఉంటుంది. అసలు నిజంగా ఆ ఆత్మ తన తండ్రిదేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఆ ఆత్మ ఎవరిది? ఆత్మ ఆవహించిన ఆ చిన్నారి పరిస్థితి ఏంటి? అసలు ఇంతకీ ఆత్మ ప్రతీకారం తీర్చుకుందా లేదా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీరు 1920 అనే సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి