iDreamPost
android-app
ios-app

వర్చువల్‌ మీటింగ్‌లో CEO మసాజ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

వర్చువల్‌ మీటింగ్‌లో CEO మసాజ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు మానవ జీవనశైలిని సులభతరం చేసింది. ఇంటర్నెట్ పుణ్యమాని ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో అంతర్జాలం నుంచి పొందొచ్చు. సాంకేతిక పరిజ్నానం వినియోగంతో సమయం ఆదాతో పాటు క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆఫీసులకు సంబంధించిన మీటింగ్స్ లల్లో వర్చువల్ విధానంలో కంపెనీ ప్రతినిధులు హాజరవుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ సంస్థకు చెందిన సీఈఓ వర్చువల్ మీటింగ్ కు హాజరయ్యారు. కానీ ఆ మీటింగ్ లో అతడు ఒంటిపై షర్ట్ లేకుండా మసాజ్ చేయించుకుంటూ కనిపించాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ విధానంలోనే ఎక్కువ పనులు జరిగిపోతున్నాయి. ప్రముఖ సంస్థలన్నీ వర్చువల్ మీటింగ్ ద్వారానే పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ వర్చవల్ విధానంలో మీటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు అతడు ఒంటిమీద షర్ట్ లేకుండా ఉండంతో పాటు మసాజ్ చేయించుకుంటూ కనిపించాడు. కాగా టోనీ మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను లింక్డిన్ లో పోస్ట్‌ చేశారు.

ఎయిర్‌ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏయిర్ ఏషియా సీఈఓను ఏకిపారేస్తున్నారు. మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరవ్వడమే కాకుండా మా వర్క్‌ కల్చర్‌ ఇదీ అంటూ చెప్పుకుంటున్న అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీకి సీఈఓగా ఉండి మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌కు ఇలా షర్ట్‌లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి