iDreamPost
android-app
ios-app

NBK 108 బాలయ్య సినిమాలో శివయ్య

  • Published Jun 20, 2022 | 5:46 PM Updated Updated Jun 20, 2022 | 5:46 PM
  • Published Jun 20, 2022 | 5:46 PMUpdated Jun 20, 2022 | 5:46 PM
NBK 108 బాలయ్య సినిమాలో శివయ్య

టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్లు సెట్టవుతున్నాయి. మల్టీ స్టారర్లు, రేర్ కాంబోలు తెరకెక్కతున్నాయి. అందులో బాలయ్య మూవీ కూడా ఉండబోతోందని లేటెస్ట్ అప్ డేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్ టైనర్ లో డాక్టర్ రాజశేఖర్ కూడా నటిస్తారట. ఈ మేరకు ప్రాధమికంగా ఒక సిట్టింగ్ అయ్యిందని, ఆయన్నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇలాంటివి సింపుల్ గా ప్రకటించరు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కానీ ఈలోగా ఈ లీక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సాయికుమార్ కు బదులు ఈ సినిమాలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని రాజశేఖర్ ఫిక్స్ అయ్యారట.

సో కొత్త బాలయ్య సినిమాలో ఒకప్పటి శివయ్య నటించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. ఇందులో ఇప్పటిదాకా ఎంపికైన తారాగణంలో ప్రియమణి ఉన్నారు. బాలయ్య కూతురిగా శ్రీలీల ఉంటుందన్న ప్రచారం జరిగింది కానీ ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. రాజశేఖర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. ఇటీవలే ఆయనకు సోలో హీరోగా మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకుని మలయాళం హిట్ మూవీ రీమేక్ శేఖర్ చేస్తే దానికి కనీస వసూళ్లు రాలేదు. థియేటర్ రిలీజ్ కోసం ఓటిటి ఆఫర్లను కాదని మరీ రిస్క్ చేశారు. కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇప్పుడు గరుడవేగా సీక్వెల్ చేయడం అనుమానంగానే ఉంది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న బాలకృష్ణ అది కాగానే వెంటనే అనిల్ రావిపూడితో జాయిన్ అవుతారు. దీని షూట్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉంటుంది. అనిల్ ఎక్కువ టైం తీసుకునే బాపతు కాదు కాబట్టి 2023 వేసవిలోనే విడుదల ఆశించవచ్చు. దీని స్పీడ్ ని బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు బాలయ్య. అన్నట్టు ఈ మధ్య ఆయన వారసుడు మోక్షజ్ఞ ఎక్కువగా ఫోటోల రూపంలో బయటికి కనిపిస్తున్నారు. తనని లాంచ్ చేసే పనిలో తండ్రి ఉన్నట్టు కనిపిస్తోంది. అభిమానులు ఎన్నాళ్ళో వేచిన ఉదయం కాబట్టి అదేదో త్వరగా పూర్తి చేస్తే వాళ్ళ నిరీక్షణ ఫలిస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss