iDreamPost
iDreamPost
కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్న విధానాలు భేషుగ్గా ఉన్నాయంటూ ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ అభినందించింది. మొన్నటికి మొన్న ఎన్డిటివి కూడా ఇదే విషయమై ప్రభుత్వ విధానాలను అభినందించిన విషయం అందరికీ తెలిసిందే. వైరస్ ను కట్టడిచేయటంలో ఏపి ప్రభుత్వం సమర్ధవంతంగా కృషి చేస్తోందంటూ టైమ్స్ కితాబిచ్చింది. ఏపి తర్వాత కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు జాతీయ మీడియా విశ్లేషించింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో ఉత్తరాధి రాష్ట్రాల కన్నా ధక్షిణాధి రాష్ట్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు మీడియా అభిప్రాయపడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు మొదలైనప్పటి నుండి వ్యాప్తి నియంత్రణకు వివిధ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, కేసుల తీవ్రత తదితర అంశాల ప్రాతిపదికగా అన్నీ రాష్ట్రాల పనితీరును మీడియా విశ్లేషించింది.
టైమ్స్ విశ్లేషణ ప్రకారం ధక్షిణాది రాష్ట్రాల్లో వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు వల్ల కేసుల పెరుగుదల తక్కువగా ఉందని చెప్పింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్ కేసుల ఎక్కువగా పెరగటానికి కారణం ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో లోపాలే ప్రధాన కారణంగా మీడియా పేర్కొన్నది. పై రాష్ట్రాల వల్లే దేశంలో సమస్య పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉందని కూడా మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.
నిజానికి అందుబాటులో ఉన్న వనరులను జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నారు. అనుమానితులకు కరోనా వైరస్ పరీక్షలు వేగంగా జరిపించేందుకే ధక్షిణకొరియా నుండి లక్ష ర్యాపిడ్ కిట్లను కూడా తెప్పించిన విషయం అందరూ చూసిందే. తాజాగా తెప్పించిన కిట్ల వల్ల పరీక్షల రిజల్టు కేవలం 10 నిముషాల్లోనే తెలిసిపోతుంది. ఈ కిట్ల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. ఇటువంటి చర్యల వల్లే జాతీయ మీడియా జగన్ పనితీరును మెచ్చకుంటుంటే జాతి మీడియా మాత్రం బురద చల్లేందుకు 24 గంటలూ పనిచేస్తుండటం విచిత్రంగా ఉంది.