iDreamPost
android-app
ios-app

Shyam Singha Roy : న్యాచులర్ స్టార్ సినిమాకు నో కాంప్రోమైజ్

  • Published Oct 24, 2021 | 8:44 AM Updated Updated Oct 24, 2021 | 8:44 AM
  • Published Oct 24, 2021 | 8:44 AMUpdated Oct 24, 2021 | 8:44 AM
Shyam Singha Roy : న్యాచులర్ స్టార్ సినిమాకు నో కాంప్రోమైజ్

వరసగా రెండు డైరెక్ట్ ఓటిటి రిలీజులు వి, టక్ జగదీశ్ లు అందుకున్న న్యాచురల్ స్టార్ నాని అభిమానులు డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ని థియేటర్లలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ లో నటించిన నాని దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సాయి పల్లవి-కృతి శెట్టి కాంబినేషన్ అంచనాలు పెంచుతోంది. అంటే సుందరానికి ముందు ఇలాంటి సీరియస్ పీరియాడిక్ డ్రామా ద్వారా తన బాక్సాఫీస్ సత్తా చాటాలని నాని గట్టి సంకల్పంతో ఉన్నాడు. అందుకే ఒకవారం ముందు అల్లు అర్జున్ పుష్ప వస్తున్నా కూడా తక్కువ గ్యాప్ లో పోటీకి సిద్ధపడుతున్నాడు. ఇందులో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు నాని.

ఇక ఇటీవలే అనౌన్స్ చేసిన దసరాకు కూడా భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు ఇన్ సైడ్ టాక్. హీరోయిన్ గా తీసుకున్న కీర్తి సురేష్ రెమ్యునరేషన్ కే సుమారు 3 కోట్ల దాకా అయ్యిందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే క్యాస్టింగ్ కే ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఇక సినిమాకు ఏ స్థాయిలో పెడతారో ఊహించుకోవడం కష్టమే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ ఫేమ్ సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చడం విశేషం. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో నాని ఇందులో చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నేపథ్యం కూడా ఊహించని స్థాయిలో ఉంటుందట.

పండగ పేర్లు టైటిల్స్ వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో గట్టిగానే ఉన్నాయి. వెంకటేష్ సంక్రాంతి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఒక దీపావళి ఉండగా ఆ మధ్య వేణు ఇదే పేరుతో చేసిన చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా తెరంగేట్రం చేసిన ఉగాది ఆశించిన ఫలితం అందుకోలేదు. కళ్యాణ్ రామ్ విజయదశమి కూడా అదే ఫలితాన్ని అందుకుంది. నాగులచవితి, శ్రావణ మాసం ఇలా పండుగలు సీజన్లను ఆధారంగా చేసుకుని చాలానే వచ్చాయి. మరి నాని దసరా ఏం చేయబోతోందో చూడాలి. 2022 దసరా పండగకే దసరాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. టైమింగ్ కూడా సరిపోతుంది

Also Read : Bhajarangi : భజరంగిని తక్కువ అంచనా వేయడానికి లేదు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss