iDreamPost
android-app
ios-app

శేఖర్ మార్కు సెన్సిటివ్ లవ్

  • Published Feb 14, 2020 | 10:51 AM Updated Updated Feb 14, 2020 | 10:51 AM
  • Published Feb 14, 2020 | 10:51 AMUpdated Feb 14, 2020 | 10:51 AM
శేఖర్ మార్కు సెన్సిటివ్ లవ్

ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టొరీ సమ్మర్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది. మజిలి లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఎంసిఎ తర్వాత సాయి పల్లవి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో తన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా చిన్న మ్యూజికల్ టీజర్ ని ఏ పిల్లా అనే పాట రూపంలో విడుదల చేశారు.

వీడియోలో చైతు సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీని తనదైన స్టైల్ లో చూపించిన శేఖర్ కమ్ముల హీరో క్యారెక్టరైజేషన్ ని లైట్ గా టచ్ చేసి వదిలారు. చివరిలో సాయి పల్లవి ట్రైన్ లో అందరి మధ్య సడన్ గా ముద్దు పెడితే దానికి బదులుగా చైతు కన్నీటి పొరతో స్పందించడం, ఎవరైనా ముద్దు పెడితే ఏడుస్తారా అని సాయి పల్లవి తో చెప్పించడం అంతా క్యూట్ గా ఉంది. మొత్తానికి తన స్కూల్ లోనే లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల రూపొందించినట్టు కనిపిస్తోంది. జోడి కూడా బాగా కుదిరింది.

పవన్ సంగీతం సమకూరుస్తున్న లవ్ స్టోరీలో మొదటి ట్రాక్ తోనే కూల్ మెలోడీ రూపంలో ఆకట్టుకున్నాడు. చైతన్య పింగళి లిరిక్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏప్రిల్ లో విడుదల కానున్న లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఖరారు చేయాల్సి ఉంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తేదీ కూడా అదే నెలలో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి క్లాష్ లేకుండా రెండు సినిమాల నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. మరో మంచి కాఫీ లాంటి శేఖర్ కమ్ముల సినిమా చూడాలంటె ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom