iDreamPost
iDreamPost
సున్నితమైన భావోద్వేగాలతో సెన్సిబుల్ ఎమోషన్స్ తో సినిమాలు తీస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇద్దరు ముగ్గురు స్టార్లతో ప్లాన్ చేసుకున్నాడు కాని అవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత కొత్త నటీనటులతో ఆనంద్ హ్యాపీ డేస్ తరహలో ఓ యూత్ ఫుల్ మూవీ స్టార్ట్ చేస్తే షూటింగ్ పాతిక శాతం పూర్తి కాకుండానే అవుట్ పుట్ తేడా అనిపించడం మొత్తంగా దాన్ని క్యాన్సిల్ చేశారు.
ఇప్పుడు ఆ ప్లేస్ లో అదే కథతో నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో లవ్ స్టొరీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం శేఖర్ కమ్ముల ఇందులో ఇంటర్ క్యాస్ట్ లవ్ తెరకెక్కిస్తున్నాడట. కాకపోతే వివాదాస్పద శైలిలో కాకుండా అందరూ మెచ్చేలా యునివర్సల్ అప్పీల్ తో రూపొందిస్తున్నట్టుగా సమాచారం.
ఒకప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. బొంబాయి అందులో ప్రముఖంగా చెప్పుకోదగినది. ఆ తర్వాత సంపంగి అంతకు ముందు సప్తపది ఇలా ఎన్నో మూవీస్ ఈ సామాజిక అంశాన్ని చక్కగా ఆవిష్కరించాయి.
అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం శేఖర్ కమ్ముల లవ్ స్టొరీలో నాగ చైతన్య బాగా వెనుకబడిన వర్గానికి చెంది ఉన్నత చదువులు పూర్తి చేసిన యువకుడిగా కనిపిస్తాడట. దానికి రివర్స్ లో సాయి పల్లవి హై క్యాస్ట్ గర్ల్ గా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఒక డాన్స్ స్కూల్ బ్యాక్ డ్రాప్ ఈ ఇద్దరి మనసులు కలుస్తాయని అంటున్నారు. ఒకపక్క మావయ్య వెంకటేష్ నారప్పలో నిమ్న జాతికి చెందిన వాడిగా చేస్తుండగా ఇప్పుడు అదే టైంలో చైతు కూడా అలాంటి షేడ్స్ ఉన్న రోల్ ని మాడరన్ గా చేయడం విశేషం