iDreamPost
android-app
ios-app

ముంబై, బెంగళూరు, శ్రీశైలం హైవేలు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం?

  • Published May 11, 2024 | 5:55 PM Updated Updated May 11, 2024 | 5:55 PM

హైదరాబాద్ లో హైవేల మీద పెట్టుబడి పెట్టాలి అని మీరు అనుకుంటున్నారా? ముంబై-హైదరాబాద్ హైవే, శ్రీశైలం-హైదరాబాద్ హైవే, బెంగళూరు-హైదరాబాద్ హైవే.. వీటిలో ఏ హైవే మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్న సందేహంలో ఉన్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.

హైదరాబాద్ లో హైవేల మీద పెట్టుబడి పెట్టాలి అని మీరు అనుకుంటున్నారా? ముంబై-హైదరాబాద్ హైవే, శ్రీశైలం-హైదరాబాద్ హైవే, బెంగళూరు-హైదరాబాద్ హైవే.. వీటిలో ఏ హైవే మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్న సందేహంలో ఉన్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.

ముంబై, బెంగళూరు, శ్రీశైలం హైవేలు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం?

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఎక్కువ ఫోకస్ చేసేది హైవే ఏరియాల మీదనే. హైదరాబాద్ విషయానికొచ్చేసరికి ముంబై హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, విజయవాడ హైవే, చేవెళ్ల బీజాపూర్ హైవే ప్రధానంగా ఉన్నాయి. అయితే వీటిలో ఈ హైవే మీద రియల్ ఎస్టేట్ అనేది బూమ్ లో ఉంది. జనాలు ఏ హైవే మీద ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏ హైవే మీద పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది? అనే వివరాలు మీ కోసం. 

హైదరాబాద్ నగరం ఇప్పుడు విస్తరిస్తోంది. హైదరాబాద్ దాని పరిమాణాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ సమీపంలో ఉన్న హైవేల మీద పెట్టుబడులు పెట్టేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ముంబై హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేలకు సంబంధించి రియల్ ఎస్టేట్ నిపుణులు చాలా మంది ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత త్వరగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది? ఎంత త్వరగా పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ వస్తాయి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. శ్రీశైలం, బెంగళూరు, ముంబై హైవేల్లో చాలా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు రానున్నాయి. అయితే వీటన్నిటికంటే కూడా ముంబై హైవే అనేది ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది.

దీనికి కారణం ముంబై హైవే మీద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) అనేది బాగా బూమ్ లో ఉంది. పైగా మిగతా హైవేలతో పోలిస్తే ఇక్కడ పరిశ్రమలు భారీగా వస్తున్నాయి. దానికి తోడు నిమ్జ్ అనేది అతి పెద్ద ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కారణంగా నిమ్జ్ ఉన్న ముంబై హైవే అనేది రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన పోల్ లో కూడా ముంబై హైవేకే ఎక్కువ మంది ఓటు వేశారు.

చేవెళ్ల బీజాపూర్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే వీటిలో ఏ హైవే స్థలాల మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని అడగ్గా.. ముంబై హైవేకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. బెంగళూరు హైవేకి 26 శాతం, శ్రీశైలం హైవేకి 22.2 శాతం, చేవెళ్ల బీజాపూర్ హైవేకి 10.2 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ఎక్కువ మంది ముంబై హైవేనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా చూస్తున్నారు. ఈ ఏరియాలో ప్రస్తుతం గజం స్థలం రూ. 9 వేలు, రూ. 10 వేలు, రూ. 11 వేలు రేంజ్ లో ఉన్నాయి. గత ఏడాది గజం స్థలం రూ. 5 వేలు, రూ. 6 వేలు, రూ. 7 వేలు రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు కనుక గజం 9 వేలు పెట్టి స్థలం కొనుగోలు చేస్తే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.