iDreamPost
android-app
ios-app

దేశమంతా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ తెలుగు పాన్ ఇండియా సినిమాలు..

  • Published May 16, 2022 | 6:46 PM Updated Updated May 16, 2022 | 6:46 PM
దేశమంతా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ తెలుగు పాన్ ఇండియా సినిమాలు..

ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినీ విజయాల గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో దేశంలోని ప్రేక్షకులకి తెలుగు సినిమాలపై మంచి గురి కుదిరింది. మన సినిమాల కోసం దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు. దేశమంతా వెయిట్ చేసే మన తెలుగు పాన్ ఇండియా సినిమాల లిస్ట్ ఇదే..

లైగర్ (Liger)

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఓ సాంగ్, టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ ఉండటం, బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ దీని నిర్మాణంలో భాగమవ్వడం, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. విజయ్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

పుష్ప 2 (Pushpa 2)

ఇటీవల పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో విధ్వంసం సృష్టించాడు. ఆ మాస్ సీన్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులు పిచ్చెక్కిపోయి వసూళ్లు కురిపించారు. దీంతో పుష్ప పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.

గాడ్ ఫాదర్(God Father)

మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేయడం, సల్మాన్ ఖాన్ ఇందులో ముఖ్య పాత్ర చేయడం, మరింతమంది స్టార్లు కూడా ఇందులో యాక్ట్ చేయడంతో తెలుగుతో పాటు బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

సలార్(Salaar)

బాహుబలితో మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నుంచి రాబోతున్న మరో యాక్షన్ సినిమా కావడం, KGF లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని ఇచ్చిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆదిపురుష్(Adipurush)
ప్రభాస్ డైరెక్ట్ హిందీ సినిమా కావడం, మన రామాయణం ఆధారంగా తీయడం, ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించడం, సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్ర పోషించడంతో సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. హిందీ డైరెక్ట్ సినిమా అయినా పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వనుంది. కృతి సనన్ ఇందులో సీతగా నటిస్తోంది.

ప్రాజెక్ట్ K (Project K)

ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం ఈ సినిమాకి మరింత ప్లస్ అవ్వనుంది. ఇక ఆనంద్ మహీంద్రా తన కంపెనీ నుంచి ఈ సినిమాలో కావాల్సిన వెహికల్స్ ని ఇస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

యశోద (Yashoda)

సమంత చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తి పాత్రలో చేస్తున్న తొలి సినిమా అవ్వడం, లేడి ఓరియెంటెడ్ సినిమా కావడం, సమంత మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, పుష్ప ఐటెం సాంగ్ తో సమంతకి బాలీవుడ్ లో అభిమానులు పెరగడంతో యశోద కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

RC15

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ పాన్ ఇండియా సినిమా కావడం, భారీ సినిమాలు తెరకెక్కించే శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap