iDreamPost
android-app
ios-app

మోడీ సార్‌, సహాయం చేయటంలో జ‌గ‌న్ పద్దతిని పాటించండి

మోడీ సార్‌, సహాయం చేయటంలో జ‌గ‌న్ పద్దతిని పాటించండి

కేంద్రం ల‌క్ష‌ల కోట్లు ప్ర‌క‌టించింది. మోడీ ఎప్ప‌టిలాగే నోరు తిర‌గ‌ని నిర్భ‌ర భార‌త్ అని ఏదో అన్నాడు. ఆయ‌న ఉప‌న్యాసం స‌బ్ టైటిల్స్ ఉన్నా మ‌న‌కి అర్థం కాదు. అదే మోడీ స్పెషాలిటీ. ఉపాధి కోల్పోయిన కోట్లాది మందికి ఈ సాయం అందే విధానం ఏంటో తెలియదు. రైతుల‌కి, మ‌హిళ‌ల‌కి , మ‌త్స్య‌కారుల‌కి ఇలా చాలా వ‌ర్గాల‌కి జ‌గ‌న్ డ‌బ్బులు బ్యాంకులో వేశాడు. దీంట్లో క‌న్ఫ్యూజ‌న్ లేదు. మోడీ చెప్పే మాట‌లే తిక‌మ‌క‌గా ఉన్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కి చిన్న వ‌ర్త‌కుల‌కి 10 వేలు బ్యాంక్ రుణం అన్నాడు. దేశంలో దాదాపు 50 ల‌క్ష‌ల మంది వీధి వ్యాపారులున్న‌ట్టు అంచ‌నా. పానీపూరీని రోడ్డుమీద అమ్మేవాడికి రిజిస్ట్రేష‌న్ , గుర్తింపుకార్డులు ఉండ‌వు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న‌ క్రెడిట్ హిస్ట‌రీ కూడా ఉండ‌దు. అత‌ను బ్యాంకు రుణం పొంద‌డానికి ఏం చేయాలి?

స‌హ‌జంగానే బ్యాంకులు ఏం చేస్తాయంటే పేద‌వాళ్ల‌కి అప్పులు ఇవ్వాలంటే ఏ ర‌కంగానూ అర్థంకాని అప్లికేష‌న్ ఫారాలు పెడ‌తాయి. దాంట్లో అడిగిన నానా ర‌కాల డాక్యుమెంట్స్ వాళ్లు తీసుకురాలేరు. ఒక‌వేళ తెచ్చినా ష్యూరిటీ అడుగుతాయి. వాళ్ల‌కి ష్యూరిటీ ఎవ‌రు పెడ‌తారు? ఒక‌వేళ పెట్టినా మ‌న బ్యాంకులు రోజుల త‌ర‌బ‌డి తిప్పుతాయి. వీధిలో అమ్ముకుంటే త‌ప్ప బ‌త‌క‌లేని వాళ్లు, ప‌నులు మానుకుని తిర‌గ‌డం సాధ్య‌మా?

సాధ్యం కాదు కాబ‌ట్టి ద‌ళారీలు రంగ‌ప్ర‌వేశం చేస్తారు. ప‌దివేల‌కి గాను మూడు వేలు ముడుపులు అడుగుతారు. చివ‌రికి రూ.7 వేలు ద‌క్కితే రూ.10 వేలు క‌ట్టాల్సి వ‌స్తుంది. ఫైనాన్స్ కంటే ఇదో ఏదో ర‌కంగా మెరుగే కాబ‌ట్టి పేద‌లు లంచాలిస్తారు. ఇది కాక‌పోతే బినామీ వ‌ర్త‌కులు రంగ ప్ర‌వేశం చేసి బ్యాంకు అధికారుల‌తో కుమ్మ‌క్కై డ‌బ్బులు తినేస్తారు. లేదంటే వీధి వ్యాపారుల‌కి వెయ్యి రూపాయ‌లు ఇచ్చి చోటా నాయ‌కులు రూ.9 వేలు తీసేసుకుని, వాళ్ల బ్యాంకుకు క‌డ‌తారు, లేదంటే ఎగ్గొడుతారు. మ‌న దేశంలో ఏదైనా సాధ్య‌మే.

ఎస్సీ, ఎస్టీల‌కు వాహ‌నాల కొనుగోలుకి రుణాలు ఇచ్చే స్కీం ఉంది. స‌బ్సిడీ కూడా దాదాపు 50 శాతం ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా జ‌రుగుతున్న‌దేమంటే బ‌డా బాబులు ఈ రుణాల‌ని తీసేసుకుని , కొంత మొత్తాన్ని ఎస్సీల చేతికిచ్చి మాయ చేస్తున్నారు. లెక్క‌ల్లో అభివృద్ధి క‌నిపిస్తూనే ఉంటుంది.

ఇప్పుడు కూడా ఈ స్కీం కింద రూ.5 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. రుణం కింద ఇచ్చి ద‌ళారుల్ని మేప‌డం కంటే , జ‌గ‌న్‌లా నేరుగా వాళ్ల ఖాతాల్లోకి వేస్తే నిజ‌మైన పేద‌వాళ్లు బాగుప‌డ‌తారు.