iDreamPost
android-app
ios-app

మేమూ స్వతంత్ర సమరయోధులమే..

మేమూ స్వతంత్ర సమరయోధులమే..

శాసనమండలిని రద్దు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై మండలిలో తెలుగుదేశం విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ శాసనమండలి పదవి నాకు చంద్రబాబు పెట్టిన బిక్ష అని,  పదవి పోయినంత మాత్రాన నాకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీల పోరాటం వల్లే ఈరోజు జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల గురించి, వారి పోరాటం గురించి మనం ఇప్పటికి కూడా స్మరించుకుంటున్నామన్నారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వ తుగ్లక్ విధానాల మీద, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు చేస్తున్న పోరాటంతో తాము చరిత్రలో నిలిచిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వందేళ్ల పాటు స్వతంత్ర సమరయోధుల సరసన తాము నిలిచిపోతామన్నారు.

Read Also: చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. టీడీఎల్పీలో కీలక నిర్ణయం..

తనకి ఇంత గుర్తింపు ఇచ్చిన తమ నాయకుడు చంద్రబాబు కోసం ఏ పోరాటినికైనా తానూ సిద్ధమని, ఈ పదవులు ఉన్నా పోయినా తాను లెక్కచెయ్యనన్నారు. శాసనమండలి రద్దుపై కోర్టుకి కూడా వెళ్ళాల్సిన పని లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

Read Also: మండ‌లికి మంగ‌ళం పాడితే వాళ్ల ప‌రిస్థితి ఏమిటీ?

శాసనమండలిని రద్దు చెయ్యడం ద్వారా తాము చేస్తున్న పోరాటాన్ని జగన్ అడ్డుకోలేరని, ప్రజావ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ అసమర్ధ ప్రభుత్వం గద్దె దిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలో రాజధాని మార్పుని అడ్డుకోవడానికి తాము చేస్తున్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, తమ పోరాటానికి గుర్తుగా ప్రజలు స్వతంత్ర సమరయోధుల చిత్రపటాల సరసన తమ చిత్రపటాలు పెడతారని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.