iDreamPost
android-app
ios-app

మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి మృతి

కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 83ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం తో ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్థానిక వైయంఆర్ కాలనీ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ల శివా రెడ్డి ఆ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జనతా పార్టి అభ్యర్ధి ఊటుకూరి రామిరెడ్డి పై 1700 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఎన్నికల్లో జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నుండి పోటీ చేసిన వైయస్ రాజ శేఖర రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యే గా గెలుపొందడం విశేషం.

అంతేకాక దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పేర్ల శివారెడ్డి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన ఎమ్మెల్యే గా పోటీచేసి గెలుపొందింది ఒక్కసారే అయినప్పటికీ, అయన చేసిన సేవలు ఆయనకి రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.

శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రొద్దుటూరులో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.