iDreamPost
android-app
ios-app

మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి కేటీఆర్..

మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావుపై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైనంపల్లి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంలో తన కుమారుడి గురించి, అతడు చేసిన సేవల గురించి తెలియజేశారు. కరోనా టైమ్ లో తన కుమారుడు మైనంపల్లి రోహిత్ పేద వారికి సేవ చేశాడని తెలిపారు. ఇదే సందర్భంలో ఆరోగ్యశాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు ఫైర్ అయ్యారు. మెదక్ లో హరీష్ రావు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, తప్పకుండా ఆయనకు తగిన బుద్ధి చెప్తానని తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు  కేటీఆర్ ఓ ట్వీట్ కూడా  చేశారు. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా ఆయన వెంటే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. మన ఎమ్మెల్యే ఒకరు.. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారని..మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.

తామంతా మంత్రి హ‌రీశ్‌రావు వెంట ఉంటామని, ఆయ‌న‌కు అండ‌గా నిలబడతామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి హ‌రీశ్‌రావు ఉన్నారని, బీఆర్ఎస్ మూల‌ స్తంభంగా హ‌రీశ్‌రావు కొన‌సాగుతారని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.  తనకు  మరోసారి సిరిసిల్ల అభ్యర్థిగా  పోటీ చేసే అవకశాం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మరి.. హరీష్ రావు విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: BRS అభ్యర్థుల తొలి జాబితా విడుదల..