iDreamPost

BRS అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

BRS అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

వచ్చే శాసన సభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల తొలి జాబితాను గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో జరిగే అవకాశాలుండటంతో .. గతంలో మాదిరిగానే కనీసం మూడు నెల్ల ముందుగానే అభ్యుర్ధుల జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి  105 మందితో తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ఈ దఫా కూడా 115 మందితోనే  తొలి జాబితాను ప్రకటించారు. ఈ సారి సిట్టింగ్ లో ఏడుగురిని మార్చారు.  ఈసారి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన స్థానమైన గజ్వేల్ తో పాటు  కామారెడ్డి నుంచి కూడా సీఎం కేసీఆర్ పోటి చేయనున్నారు.

త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల కోసం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక చేశారు. అలానే ఎక్కువ మంది అభ్యర్ధులను ప్రకటించం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పడే విధంగా బీఆర్ఎస్ వ్యూహాం రచించింది. ఎంతమంది సిట్టింగ్ లకు టికెటు వస్తుంది. ఎంతమందికి ఊడూతుందనే టెన్షన్ నెలకొన్న వేళ కేసీఆర్ అభ్యర్ధుల లిస్ట్ ను ప్రకటించారు.  బీఆర్ఎస్ ప్రకటించిన ఈ జాబితో టికెట్ పొందిన వారు సంతోషంలో మునిగిపోగా.. టికెట్ దక్కన వారు నిరాశ చెందారు.

ఉమ్మడి  అదిలాబాద్  జిల్లా నుంచి ఎక్కువ మందికి  సిట్టింగ్ లు మరోసారి తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. చెన్నూరు నుంచి బాల్క సుమన్,అదిలాబాద్ నుంచి  మంత్రి జోగు రామన్న, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి ముఖ్యనాయకులతో పాటు మరికొందరు  పేర్లను అధిష్టానం ప్రకటించింది.అలానే ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కూడ అందరిని ఆశ్చరానికి గురి చేసేలానే అదిష్టానం ప్రకటించింది. నిజామాబాద్ సిటీ నుంచి గణేష్ బిగాలా, నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ నంచి వేముల ప్రశాంత్ రెడ్డి ల పేర్లు తొలి జాబితాలో  ఉన్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడ ఉన్నాయి.ఇక ఉమ్మడి కరీనంగర్ జిల్లా విషయానికి వస్తే మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్ మళ్లీ వారి స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. అలానే మానుకొండూరు నుంచి రసమయి బాలకిషన్, రామగుండ నుంచి కోరుకంటి చందర్, కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావు , హుస్నాబాద్ నుంచి ఒడిత సతీష్ లతో పాటు మరికొందరు పేర్లను అధిష్టానం ప్రకటించింది.

అదే విధంగా కేసీఆర్ సొంత ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నుంచి టి. హరీష్ రావు, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, పఠాన్ చెరువు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ పేర్లు తొలి జాబితాలో ప్రకటించారు. వీరితో పాటు మరికొందరి పేర్లను అధిష్టానం ప్రకటించింది. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో భారీగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను బీఆర్ఎస్ బాస్ ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ లో అదే స్థానాల నుంతి తిరిగి పోటి చేస్తున్నారు. వారితో పాటు మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద పేర్లను ప్రకటించారు.

అలానే కూకట్ పల్లి: మాధవరం కృష్ణారావు, ఇబ్రహీంపట్నం: మంచి రెడ్డి కిషన్ రెడ్డి,  ఉప్పల్: బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వికారాబాద్: మెతుకు ఆనంద్, తాండురు: పైలెట్ రోహిత్ రెడ్డి, ఖైరతాబాద్: దానం నాగేందర్, జూబ్లీహిల్స్: మాగంటి గోపినాథ్, సికింద్రాబాద్: పద్మరావుల పేర్లను అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించింది. సీట్లు కోల్పోయిన వారిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, వైరా నుంచి మదన్ లాల్, వేముల వాడ ఎమ్మెల్యే చల్మెడ, ఖానాపూర్ ఎమ్మెల్యే జాన్సన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్,

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక: రేగా కాంతారావు,ఇల్లందు-బానోతు హరిప్రియ నాయక్, ఖమ్మం: పువ్వాడ  అజయ్, పాలేరు: ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య, కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరావు, ములుగు- బడే నాగజ్యోతి, మధిర- లింగాల కమల్ రాజు, వైరా-బానోతు మదన్ లాల్, అశ్వారావు పేట-మెచ్చా నాగేశ్వరావు, భద్రచాలం- తెల్లం వెంట్రావు పేర్లతో పాటు మరికొన్ని పేర్లను మొదటి జాబితాలో ప్రకటించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్, జనగాం నియోజకవర్గాలను కేసీఆర్ పెడింగ్ లో పెట్టారు. ఇక ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలిజాబితా విషయానికి వస్తే.. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి పోటి చేయనున్నారు. పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, నర్సం పేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, అలానే వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్ర, వర్ధన్న పేట నుంచి ఆరూరి రమేష్, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డిను పేర్లను తొలి జాబితాలో ప్రకటించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి, జడ్చర్ల- సి. లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి, గద్వాల్-బి.కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్-మర్రి జనార్ధన్ రెడ్డి, అలంపూర్-వీఎం అబ్రహం, కొల్లాపూర్-బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్లతో పాటు మరికొందరి పేర్లను తొలిజాబితాలో ప్రకటించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యపేట నుంచి జగదీశ్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. అలానే నాగార్జున్ సాగర్ నుంచి నోముల భగత్, మిర్యాలగూడ నుంచి నల్లమోతు భాస్కర్ రావు, హుజూర్ నగర్ నుంచి ఎస్. సైదిరెడ్డి, కోదాడ నుంచి బొల్లం మల్లయ యాదవ్,  నల్లొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, దేవరకొండ నుంచి రవీంద్ర కుమార్, రమావత్, భువనగిరి నుంచి ఫైళ్ల శేఖర్ రెడ్డి తో పాటు మిగిలిన స్థానాల్లోని అభ్యర్ధుల పేర్లను కూడా కేసీఆర్ ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి