iDreamPost
android-app
ios-app

క‌ష్ట‌కాలంలో అచ్చెన్న‌కు వైసీపీ మంత్రి స‌పోర్ట్..!!

  • Published Apr 14, 2021 | 2:12 PM Updated Updated Apr 14, 2021 | 2:12 PM
  • Published Apr 14, 2021 | 2:12 PMUpdated Apr 14, 2021 | 2:12 PM
క‌ష్ట‌కాలంలో అచ్చెన్న‌కు వైసీపీ మంత్రి స‌పోర్ట్..!!

రాజ‌కీయాల‌లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు.. మిత్రుడు, శ‌త్రువు కావొచ్చు.. శ‌త్రువు అక‌స్మాత్తుగా మిత్రుడు కావొచ్చు.. పై శీర్షిక చూసిన వెంట‌నే ఇటువంటి ఆలోచ‌న‌లు ఏవేవో వ‌చ్చేస్తున్నాయా..? ‌మ‌రి లేక‌పోతే తెలుగుదేశం రాష్ట్ర అధ్య‌క్షుడికి వైసీపీ మంత్రి స‌పోర్ట్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అక్క‌డే ఉంది ట్విస్ట్.

అచ్చెన్నాయుడు.. తెలుగుదేశం పార్టీని, లోకేశ్ ను తిడుతున్న‌ట్లుగా ఓ వీడియో వైర‌ల్ అవుతున్న‌ట్లుగా తెలిసిందే. ఇది రాజ‌కీయంగా ఎన్నో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది. అయ్య బాబోయ్.. ఆ వ్యాఖ్య‌లు నావి కావ‌ని అచ్చెన్న మొత్తుకుంటున్నా, ఎవ‌రూ న‌మ్మ‌డం లేదండోయ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని కాసింత పొలిటిక‌ల్ జ్ఞానం ఉన్న‌వారెవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. అటువంటిది ఓ హోదాలో ఉన్న వ్య‌క్తికి, క‌ళ్లెదుటే పార్టీలోని ప‌రిస్థితులు చూస్తున్న‌వ్య‌క్తికి ఆ మాత్రం బాధ‌, ఆవేశం ఉండ‌వా..?!

Also Read : ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ..!

ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అచ్చెన్నాయుడు నిన్న టీడీపీపై చంద్రబాబు లోకేష్ లపై మాట్లాడినట్టున్నగా ఉన్న వీడియోల‌కు వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, జగన్ అన్నా, వైసీపీ అన్నా ఒంటికాలిపై లేచే అచ్చెన్నాయుడు మనసులో టీడీపీపై కోపం ఈ స్థాయిలో ఉందా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు కామెంట్స్ మైనస్ అయ్యాయని అంటున్నారు.

తాజాగా ఈ వీడియోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అచ్చెన్నకు వైసీపీ మంత్రి బొత్స తన పూర్తి మద్దతు ప్రకటించారు. ‘అచ్చెన్నాయుడు తప్పు ఏమీ మాట్లాడలేదు. ఆయన లోకేష్ మీద చేసిన వ్యాఖ్యల్లో చాలా నిజమే ఉంద’ని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. తిరుప‌తి ఉప ఎన్నిక వేళ అనూహ్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ వీడియోపై వైసీపీ నేత‌ల కౌంట‌ర్లు, సెటైర్లు తెలుగుదేశం నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబు కానీ, లోకేశ్ కానీ ఇంకా స్పందించక పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : టీడీపీ, లోకేష్‌లపై అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş