Idream media
Idream media
నీటిపారుదల ప్రాజెక్టుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. పొతిరెడ్డిపాడు అంశం కేంద్రం మొదలైన ఈ మాటల పర్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపైకి మళ్లింది. పోలవరం ప్రాజెక్టును తమ హయాంలో 70 శాతం పూర్తయిందని, వెలుగొండను పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడగా.. ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్న దేవినేమి ఉమా మహేశ్వరరావు.. దాన్ని నిరూపిస్తే తాను మీసం తీసేసి తిరుగుతానని, నిరూపించలేకపో ఆయన మీసం తీసేసి తిరుగుతారా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ హాయంలో పూర్తయిందని చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి ఫైర్ అయ్యారు.
రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ కాదా..? అని అనిల్‌కుమార్ సూటిగా ప్రశ్నించారు. నిజంగా రాయలసీమకు మంచి చేసి ఉంటే గడిచిన ఎన్నికల్లో సీమ ప్రజలు కనీసం 10 సీట్లయినా ఇచ్చేవాళ్లని పేర్కొన్నారు. గాలేరు నగరి పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు.