iDreamPost
android-app
ios-app

అరుదైన ‘బద్రి’ క్షణాలు – Nostalgia

  • Published Apr 01, 2020 | 12:00 PM Updated Updated Apr 01, 2020 | 12:00 PM
అరుదైన ‘బద్రి’ క్షణాలు – Nostalgia

పవన్ కళ్యాణ్ కెరీర్ లో 2000లో విడుదలైన బద్రిని చాలా స్పెషల్ మూవీగా చెప్పుకోవచ్చు. మాస్ హీరోయిజంకి కొత్త డెఫినెషన్ ఇచ్చిన పూరి జగన్నాధ్ మొదటి సినిమాగా అతని అభిమానులకు సైతం ఇది స్పెషల్ మెమరీగా నిలిచిపోతుంది. పవన్ కెరీర్ ప్రారంభంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి అద్భుత ఫలితాలు అందుకున్నారు. తొలిప్రేమ కరుణాకరన్ కు డెబ్యూ. అది ఎంత చరిత్ర సృష్టించిందో అందరికి తెలిసిందే. అరుణ్ ప్రసాద్ ని పరిచయం చేస్తూ తమ్ముడు ఆఫర్ ఇచ్చిన పవన్ దాని రూపంలో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

బద్రి మొదలయ్యే టైంకే ఇవి రిలీజై ఆయా దర్శకులకు లైఫ్ ఇచ్చాయి. అదే ఊపులో వర్మ శిష్యుడు పూరి జగన్నాధ్ చెప్పిన లైన్ నచ్చడంతో పవన్ మరో ఆలోచన చేయకుండా బద్రికు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన రియల్ లైఫ్ లో జీవిత భాగస్వామిగా రేణు దేశాయ్ అడుగు పెట్టడానికి మొదటి అడుగు పడింది బద్రి సెట్ లోనే. అక్కడ మొదలైన పరిచయం పెళ్లి దాకా వెళ్ళింది. తర్వాత ఇద్దరూ కలిసి జానీలో కూడా నటించారు. బద్రి సూపర్ హిట్ కావడానికి దోహదపడినవి చాలా ఫ్రెష్ గా అనిపించే పూరి టేకింగ్, రమణ గోగుల ట్రెండ్రీ మ్యూజిక్, నందాగా ప్రకాష్ రాజ్ విలనీ ఇవన్నీ ప్లస్ అయ్యాయి. హీరోయిన్ గా అమీషా పటేల్, రెండో కథానాయకిగా రేణు దేశాయ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.

పైకి లవ్ స్టోరీలా కనిపించినా ఇందులో మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు పూరి. ఇక్కడ మీరు చూస్తున్న పిక్ ఆ షూటింగ్ సందర్భంలోనిదే. షూట్ గ్యాప్ లో ఏదో సంభాషణ జరుగుతుండగా పూరి పగలబడి నవ్వడం గమనించవచ్చు. బద్రి పేరు చెప్పగానే ఇప్పటికీ ఫ్యాన్స్ కు గుర్తొచ్చేది ఏ చికీతా లాంటి పాటలు, నువ్వు నందా అయితే నేను బద్రి బద్రినాథ్ అంటూ పవన్ పేల్చే డైలాగులు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవన్ పూరితో కెమెరా మెన్ గంగతో రాంబాబు చేశాడు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇంకోసారి ఈ కాంబోలో బద్రి లాంటి పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఎప్పటికి నెరవేరుతుందో.