iDreamPost
android-app
ios-app

Megastar : మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా ?

  • Published Feb 02, 2022 | 9:40 AM Updated Updated Feb 02, 2022 | 9:40 AM
  • Published Feb 02, 2022 | 9:40 AMUpdated Feb 02, 2022 | 9:40 AM
Megastar : మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా ?

సైరా తర్వాత ఏ సినిమా రిలీజ్ కాకపోయినా వరస బెట్టి షూటింగులు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి రెండు మూడేళ్ళ పాటు బిజీగా ఉండేలా ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం చూస్తున్న సంగతే. యూత్ హీరోల కంటే వేగంగా అనౌన్స్ మెంట్లు, చిత్రీకరణలు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది స్టార్ట్ అవ్వాల్సినవి ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్నాయి. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో డివివి దానయ్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి గాను స్క్రిప్ట్ వర్క్ తో పాటు క్యాస్టింగ్ పనుల్లో వెంకీ చాలా బిజీగా ఉన్నాడు. ఒక వీరాభిమానిగా తన హీరోని ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో ఉంది.

ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ ని సెట్ చేసుకోవడం ఓ సవాల్ లాంటిదే. ఎందుకంటే సీనియర్ స్టార్లకు జోడిగా ఇప్పటి భామలు వయసు రిత్యా అంతగా సెట్ కారు. ఒకప్పుడు మనవరాలి వయసున్న శ్రీదేవితో ఎన్టీఆర్ ఆడిపాడితే నడిచింది కానీ ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అప్ డేట్ అయిన జనాలు ఆడ్ కాంబినేషన్లను ఒప్పుకోవడం లేదు. పైగా వీళ్ళతో చేస్తే యూత్ హీరోలు తమను తీసుకోరన్న భయం కూడా నెలకొంది. అందుకే చిరు కోసం కాజల్ అగర్వాల్(ఖైదీ నెంబర్ 150-ఆచార్య), తమన్నా(సైరా-భోళా శంకర్)లను రెండేసి సార్లు జంట చేయాల్సి వచ్చింది. నయనతార కూడా సైరా-గాడ్ ఫాదర్ లో నటించడం చూస్తున్నాం.

ఇప్పుడీ వెంకీ కుడుముల సినిమా కోసం మాళవిక మోహనన్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. పేట, విజయ్ మాస్టర్,ధనుష్ మారన్ లో నటించిన ఈ అమ్మడు మరీ లేతగా ఉండదు. కాస్త ఎక్కువ పొడవుతో రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు భిన్నంగా కనిపిస్తుంది. సో చిరంజీవి పక్కన ఎబ్బెట్టుగా ఉండకపోవచ్చని వెంకీ అభిప్రాయపడుతున్నారట. మరి ఆమె కనక ఒప్పుకుంటే ఒక టెన్షన్ తీరిపోతుంది. రౌడీ అల్లుడు తరహాలో పక్కా ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తారని ఇన్ సైడ్ టాక్. విడుదల ఈ ఏడాది ఉండదు కానీ 2023 వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది

Also Read : Ramarao On Duty : రవితేజ టీమ్ మళ్ళీ మార్చుకోక తప్పదేమో

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom