iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ క్రేజీ పార్టీ.. ఆ హీరోలకే ఎందుకంటే??

మెగాస్టార్ క్రేజీ పార్టీ.. ఆ హీరోలకే ఎందుకంటే??

ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు. ఆ చిత్ర బృందాన్ని, లేదా హీరోను పిలిచి అభినందిస్తూ ఉంటారు చిరు. ఇక తన మిత్రుడు, లోక నాయకుడైన కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ ను చూసిన మెగాస్టార్ ఏకంగా పార్టీతో పాటు కమల్ ను సత్కరించారు.

చిరంజీవికి విక్రమ్ సినిమా బాగా నచ్చేసింది. దానికి తోడు సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ లను పార్టీకి రావాల్సిందిగా కోరారు. చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ పార్టీకి బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిచింది.

ఆచార్య చిత్రం తరువాత హాలిడే ట్రిప్ కు వెళ్ళారు చిరంజీవి. టూర్ ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత విక్రమ్ సినిమాను చూశారు. కమల్ హాసన్ కు చాలా రోజుల తరువాత పెద్ద హిట్ వచ్చిన కారణంగా ఆ ఆనందాన్ని పంచుకుంటూ కమల్ ను శాలువాతో సత్కరించారు. ఆ ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకోగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

“వాట్ ఏ థ్రిల్లిం గ్ ఫిల్మ్ . మై ఫ్రెం డ్.. నువ్వు మరిం త శక్తిమం తం కావాలని కోరుకుం టున్నా” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరు.

ప్రస్తుతం చిరంజీవి మలయాళం సినిమా “గాడ్ ఫాదర్” ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. పైగా సల్లూ భాయ్ సైతం షూటింగ్ కోసం హైదరాబాద్ కు రావడంతో ఇలా అందరూ కలిసి అభిమానులకు కనువిందు చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom