iDreamPost
android-app
ios-app

ACP విక్రమ్ సాగర్ గా రవితేజ ఊరమాస్

  • Published Dec 12, 2022 | 1:51 PM Updated Updated Dec 12, 2022 | 1:51 PM
ACP  విక్రమ్ సాగర్ గా రవితేజ ఊరమాస్

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ తమ్ముడిగా ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ దాని టీజర్ విడుదల చేశారు. ఏసివి విక్రమ్ సాగర్ గా చాలా స్టైలిష్ అవుట్ ఫిట్ లో ఎవని అయ్య మాట నేను వినను అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. నిమిషం లోపే అయినా అభిమానులు కోరుకున్న స్టఫ్ ని బాబీ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. డైరెక్టర్ గా ఇతని డెబ్యూ మూవీ పవర్ లో హీరో రవితేజనే. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ అలా కొనసాగుతోంది. ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరు రవికు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది ఈ కారణం వల్లే.

అంచనాలు మెల్లగా ఎగబాకుతున్న క్రమంలో ఈ టీజర్ హైప్ ని పెంచేలానే ఉంది. రొటీన్ మాస్ స్టఫ్ అయినప్పటికీ ఇందులో ఆడియన్స్ ఆశిస్తున్నవి ఇవే. టైటిల్ తో సహా కథ బ్యాక్ డ్రాప్, సవతి అన్నదమ్ముల మధ్య వైరం, ఒకరు పోలీస్ ఆఫీసర్ మరొకరు సముద్రంలో స్మగ్లింగ్ చేసే హీరో ఇలా చూసేసిన సెటప్ తోనే కథ రాసుకున్నట్టు అనిపించినా ఈ కాంబో తెరమీద ఓ రేంజ్ లో పండుతుందని ఇన్ సైడ్ టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటికే బాస్ పార్టీ వైరల్ అయిపోయి పాతిక మిలియన్ల వ్యూస్ చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం విదేశాల్లో నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట షూట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డితో గట్టి పోటీ ఎదురుకుంటున్న వాల్తేరు వీరయ్యకు వారసుడు, తెగింపు, విద్యావాసుల అహం, కళ్యాణం కమనీయం నుంచి థియేటర్ల పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్నీ ఒకే రేంజ్ సినిమాలు కాకపోయినా చిన్న సెంటర్లలో స్క్రీన్లు తక్కువగా ఉన్న చోట పంపకాలు ఇబ్బందులు తేవడం ఖాయం. కంటెంట్ మీద బాబీతో పాటు టీమ్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఈ నెలాఖరుకు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ పూర్తి చేస్తే ఎలాంటి టెన్షన్లు తగ్గుతాయి. ముప్పై రోజుల కౌంట్ డౌన్ మొదలైపోయింది కాబట్టి ఇకపై సమయం బంగారంకన్నా విలువైందిగా మారనుంది. ముఖ్యంగా మైత్రి సంస్థకి ఇదంతా ఒత్తిడితో కూడుకున్న సవాలే.